Moviesశ్యామ్‌సింగ‌రాయ్‌కు స‌పోర్ట్‌గా బాల‌య్య ఫ్యాన్స్‌... ర‌చ్చ మామూలుగా లేదే...!

శ్యామ్‌సింగ‌రాయ్‌కు స‌పోర్ట్‌గా బాల‌య్య ఫ్యాన్స్‌… ర‌చ్చ మామూలుగా లేదే…!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన శ్యామ్‌సింగరాయ్ ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమాకు సూప‌ర్ డూప‌ర్ టాక్ వ‌చ్చింది. ఏ సైట్లో చూసినా కూడా రేటింగ్‌లు 3.5 పైనే ఉన్నాయి. దీనిని బ‌ట్టే శ్యామ్‌సింగ‌రాయ్ ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుందో క్లీయ‌ర్‌గా తెలుస్తోంది. ఇక ఏపీలో ప్ర‌భుత్వానికి సినిమా వాళ్ల‌కు న‌డుస్తోన్న యుద్ధంలో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు సినీ నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు హైకోర్టు నుంచి ప్ర‌త్యేక అనుమ‌తులు తెచ్చుకున్నారు. దీంతో త‌మ‌ను కాద‌ని వీళ్లు కోర్టుకు వెళ్ల‌డంతో ప్ర‌భుత్వ పెద్దల కోపం న‌షాళానికి అంటిన‌ట్టు ఉంది.

దీంతో వాళ్లు థియేట‌ర్ల‌ను టార్గెట్ చేయ‌డం స్టార్ట్ చేశారు. దీనికి తోడు నిన్న నాని సైతం ఏపీలో టిక్కెట్ల రేట్ల‌తో పాటు ప్ర‌భుత్వం తీరు ప‌ట్ల త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ప్రెస్‌మీట్లో నాని మాట్లాడుతూ థియేట‌ర్ల కంటే ప‌క్క‌నే ఉన్న కిళ్లీ కొట్ల‌లో క‌లెక్ష‌న్లే ఎక్కువుగా ఉన్నాయ‌ని సెటైర్ వేశారు. దీనిపై ఏపీ మంత్రులు కూడా నానికి కౌంట‌ర్లు ఇస్తున్నారు. కొంద‌రు ఇండ‌స్ట్రీ వాళ్లు నానికి స‌పోర్ట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు సీనియ‌ర్ హీరో బాల‌య్య ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు స‌పోర్ట్ చేస్తూ నానికి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాకు హిట్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కూడా బాల‌య్య ఫ్యాన్స్ త‌మ హీరో సినిమా హిట్ అయిన‌ట్టుగా సంబ‌రాలు చేసుకుంటూ శ్యామ్‌సింగ‌రాయ్ సినిమాను ప్ర‌తి ఒక్క‌రు చూడాల‌ని కామెంట్లు పెడుతున్నారు. ఇక నానికి, బాల‌య్య‌కు మ‌ధ్య బంధం ఇప్ప‌టి నుంచే కాదు.. గ‌తం నుంచే ఉంది.

నాని అష్టాచెమ్మా సినిమాలో బాల‌య్య అభిమానిగా న‌టించాడు. ఆ త‌ర్వాత బాల‌య్య శ్రీరామ‌రాజ్యం సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. త‌ర్వాత ఎప్పుడూ బాల‌య్యపై అభిమానం చాటుకుంటూనే వ‌స్తున్నాడు. ఇక బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోకు కూడా నాని గెస్ట్‌గా వ‌చ్చాడు. ఇక ఇప్పుడు నాని సినిమాకు ఏపీలో ప్ర‌భుత్వం వైపు నుంచి ఇబ్బందులు వ‌స్తున్నా బాల‌య్య ఫ్యాన్స్ మాత్రం తాము క‌సితో సినిమాను చూసి, స‌పోర్ట్ చేసి హిట్ చేస్తామ‌ని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news