Moviesమెగా ఫ్యామిలీకి క‌ళ్యాణ్‌దేవ్ దూరంగా... ఇంత జ‌రిగిందా...?

మెగా ఫ్యామిలీకి క‌ళ్యాణ్‌దేవ్ దూరంగా… ఇంత జ‌రిగిందా…?

మెగాస్టార్ చిరంజీవి సినిమా అల్లుడుగా విజేత సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. చిరు చిన్న కుమార్తె శ్రీజ‌ను వివాహం చేసుకున్న కళ్యాణ్‌కు తొలి సినిమా విజేత నిరాశనే మిగిల్చింది. ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిన కళ్యాణ్ కు కాలం కలిసి రాలేదు. ఆ తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఈ సినిమాల‌తో తన కెరీర్ గాడిలో పడుతుందని ఆశాభావంతో ఉన్నాడు.

ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నాడు అన్న గుస‌గుస‌లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా ఇందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. శ్రీజ‌ తన భర్త ఉన్న ఫోటోలను ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేయడం లేదు. దీంతో భార్యాభర్తల మధ్య ఎక్కడో గ్యాప్ ఉంద‌న్న వార్త‌లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇటీవల సోషల్ మీడియా వెబ్ సైట్లు అయితే వీరిద్దరు దూరంగా ఉంటున్నారని కూడా వార్తలు రాస్తున్నాయి. కారణం ఏంటన్నది తెలియదు కానీ రామ్ చరణ్ వల్లే కళ్యాణ్ మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పాల్గొన్న ఫంక్షన్ల‌లో కూడా క‌ళ్యాణ్‌ ఎక్కడ కనిపించలేదు. ఇది కూడా వీరు ఎడబాటుకు మరింత బలాన్ని ఇచ్చేలా ఉందంద‌ని కొంద‌రు సందేహించారు.

అయితే శ్రీజ బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ మాత్రం తన భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసి లవ్ సింబల్ యాడ్ చేసి విషెస్ చెప్పడంతో ఈ అనుమానాలకు కొంతవరకు ఫుల్‌స్టాప్‌ పడింది. చాలా మంది మాత్రం చెర్రీతో విబేధాల వ‌ల్లే క‌ళ్యాణ్ ఆ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడంటున్నారు. మ‌రి ఈ బావ‌, బావ‌మ‌రుదులు ఇద్ద‌రూ క‌లిసి ఒక్క ఫొటో షేర్ చేస్తూ ఈ పుకార్ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news