Moviesఅఖండ‌లో బాల‌య్య హెయిర్ స్టైల్ కోసం అంత బడ్జెట్ పెట్టారా...

అఖండ‌లో బాల‌య్య హెయిర్ స్టైల్ కోసం అంత బడ్జెట్ పెట్టారా ?

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ‌ సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ జాతరకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రు. 60 కోట్ల షేర్ కొల్లగొట్టిన అఖండ .. పుష్ప సినిమా వచ్చేవరకు బాక్సాఫీస్‌ను దున్నేయ‌నుంది. మరోవైపు ఆహా లో వస్తున్న అన్‌స్టాప‌బుల్ టాక్ షోను హోస్ట్ చేస్తున్న బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రానున్న తన తర్వాత సినిమాకు కూడా రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న శృతీహాస‌న్ హీరోయిన్‌గా చేస్తోంది. మ‌రో పాత్ర‌కు ల‌క్ష్మీరాయ్‌ను ఎంపిక చేశార‌ని స‌మాచారం.

ఇక అఖండ‌ సినిమాలో బాలయ్య మురళీకృష్ణతో పాటు అఖండ పాత్రలో కనిపించారు. మురళీకృష్ణ పాత్రలో బాలయ్య అందంగా, సుందరంగా కనిపిస్తే మాత్రం అఖండ పాత్ర‌లో కాస్త భీక‌రంగా క‌నిపించారు. బాలకృష్ణ ఎలా ప్ర‌జెంట్ చేయాలో బోయ‌పాటి శ్రీనుకు తెలిసిన‌ట్టుగా.. మ‌రే ద‌ర్శ‌కుడికి తెలియదు అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే బోయపాటి తీసిన మూడు సినిమాల్లోనూ బాలయ్యను చాలా అందంగా చూపించారు.

అఖండ సినిమాలో బాలయ్య అందం వెనుక ఆయన విగ్‌ కూడా ఉందనే చెప్పాలి. ఈ విగ్‌ల‌ కోసమే ఏకంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేశారట. అఖండ లో బాలయ్య కోసం మొత్తం 50 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మురళీకృష్ణ పాత్రకే 3 విగ్‌లు ఉపయోగించారు. ఈ మూడు విగ్‌ల‌ కోసం రు. 39 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ లుక్ కోసం ముంబైకి చెందిన ఒక హెయిర్ స్పెషలిస్ట్ తీసుకువచ్చారు.

ఆ హెయిర్ స్టైలిస్ట్‌కే రు. 12 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా చూస్తే అఖండ మేకర్స్ బాల‌య్య లుక్‌ కోసం రు. 50 లక్షలు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ ఖ‌ర్చు కూడా తెర‌పై బాల‌య్య అందంలో క‌న‌ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news