Movies' అఖండ ' ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఎన్ని కోట్లు... హిట్...

‘ అఖండ ‘ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఎన్ని కోట్లు… హిట్ టాక్‌తో అంచ‌నా..!

బాల‌య్య న‌టించిన అఖండ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఓవ‌రాల్‌గా సినిమాకు హిట్ టాక్ వ‌చ్చింది. అఖండ హై ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ అని, అఘోరగా బాలయ్య చావ‌కొట్టేశాడ‌ని అంటున్నారు. ఇక సినిమాలో యాక్ష‌న్‌తో పాటు బీజీఎం, బాల‌య్య న‌ట‌న‌, అఘోరా క్యారెక్ట‌ర్ సూప‌ర్ హైలెట్స్ అంటున్నారు. అయితే హీరోయిన్ స‌న్నివేశాలు మాత్రం బోరింగ్‌గా ఉన్నాయ‌న్న టాక్ వ‌చ్చింది. హీరోయిన్ ప్ర‌గ్య జైశ్వాల్‌కు బాల‌య్య‌కు మ‌ధ్య కెమిస్ట్రీ బాండింగ్ మ‌రింత వ‌ర్క‌వుట్ అయ్యేలా సీన్లు రాసుకోవాల్సి ఉంద‌ని అంటున్నారు.

ఇక సినిమాకు ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆయువు ప‌ట్టుగా నిలిచాయి అని.. ఈ రెండు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకు వెళ్లాయ‌ని అంటున్నారు. ఇంట‌ర్వెల్ అయితే లెజెండ్‌ను మించి ఉంద‌ని అంటున్నారు. బాల‌య్య‌, నంద‌మూరి అభిమానులు మాస్ జాత‌ర‌తో ఫుల్ ఎంజాయ్ చేయ‌నున్నారు. ఏదేమైనా వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ ప‌క్కా అంటున్నారు.

ఇక అఖండ‌కు సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే బాలయ్య కెరీర్లోనే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబడుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ డే రు. 11 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా షేర్ రాబ‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే గ్రాస్ రు. 20 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని లెక్కలు వేస్తున్నారు. ఇక ఓవ‌ర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్‌ల‌తోనే 1 మిలియ‌న్ డాల‌ర్లు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.

ఇక ఓవ‌రాల్‌గా అఖండ‌కు ఫ‌స్ట్ డే అదిరిపోయే వ‌సూళ్లు అయితే రానున్నాయి. ఏపీలో కూడా టిక్కెట్ రేట్లు త‌గ్గినా ఎక్కువ థియేట‌ర్లు ఇవ్వ‌డంతో అక్క‌డ కూడా ఫుల్ క్రౌడ్ క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news