Moviesబాల‌య్య ' అఖండ ' అభిమానుల‌కు గుడ్ న్యూస్‌... పండ‌గ చేస్కోండ్రా...!

బాల‌య్య ‘ అఖండ ‘ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌… పండ‌గ చేస్కోండ్రా…!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా అఖండ. సింహ – లెజెండ్ తరహాలోనే అఖండ కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది. డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సినిమాపై ముందు నుంచి ఉన్న అంచనాల నేపథ్యంలో అఖండ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

రు. 125 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన అఖండ రు. 70 కోట్ల షేర్ కొల్ల‌గొట్టి ఈ సినిమా కొన్న బయ్యర్లు – డిస్ట్రిబ్యూటర్లు అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా అఘోరా పాత్ర పోషించిన బాలయ్య ఆ పాత్రలో ఏ హీరో కూడా చేయలేడు అన్నంతగా ప్రేక్షకుల మెప్పు పొందాడు.

ఇక సినిమాలో జై బాల‌య్య సాంగ్‌తో పాటు థ‌మ‌న్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయ్యాయి. అస‌లు బాల‌య్య కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రు. 100 కోట్ల సినిమా లేదు.. అలాంటిది ఏకంగా అఖండ రు. 125 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇంకా అఖండ కొన్ని థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. ఇప్ప‌టికే వెండితెర మీద అఖండ‌ను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్ష‌కులు ఇప్పుడు బుల్లితెర మీద కూడా ఈ సినిమాను చూసేందుకు డేట్ ఫిక్స్ అయ్యింది.

అఖండ ఓటీటీ, టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ షోల‌కు డేట్ ఫిక్స్ అయ్యింది. అఖండ ఫిబ్ర‌వ‌రి 27న టెలివిజ‌న్‌లో ప్రీమియ‌ర్‌గా ప్ర‌సారం కానుంది. అంత‌కంటే ముందు సంక్రాంతి కానుక‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. జ‌న‌వ‌రి 12న డిస్నీ + హాట్‌స్టార్‌లో అఖండ వ‌స్తోంది. ఇక అఖండ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ షోల మా టీవీలో ప్రసారం కానుంది. ఫిబ్ర‌వ‌రి 27న ప్ర‌సారం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news