Moviesఈ హీరో అలాంటి సినిమాలు కూడా చూస్తాడా..దొరికిపోయాడే..!!

ఈ హీరో అలాంటి సినిమాలు కూడా చూస్తాడా..దొరికిపోయాడే..!!

తమిళ స్టార్ హీరో మాధవన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. తమిళ సినీ పరిశ్రమలో ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్.మాధవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే. కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపిన ఈయన ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉన్నారు. 2018 సంవత్సరంలో తెలుగులో ‘సవ్యసాచి’లో విలన్‌గా నటించి మెప్పించారు. అయిత్యే నటుడిగా, రచయితగా, సినీ నిర్మాతగా తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న . ఆయన రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో ఆయన ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.

కెరీర్ మొదట్లో మాధవన్ టివీ సీరియళ్ళలో చిన్న చిన్న పాత్రల్లో కూడా చేసేవారు. 1996లో జీ టీవీలో బాగా హిట్ అయిన బనేగీ అప్నీ బాత్ సీరియల్ లో కూడా నటించారాయన. ఎన్నో ప్రకటనల్లోనూ చిన్న పాత్రల్లోనూ నటించిన తరువాత మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా అలై పాయుదే(2000)తో కెరీర్ లో పెద్ద మలుపు వచ్చింది. ఆ తరువాత ఏడాది గౌతం మీనన్ మొదటి సినిమా మిన్నలే, మద్రాస్ టాకీస్ వారి డుం డుం డుం సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రసిద్ధి చెందారు మాధవన్. 2002లో తిరిగి మణిరత్నం దర్శకత్వంలోనే కన్నత్తిళ్ ముత్తమిట్టాల్ సిన్మాలో నటించారాయన. ఆ సినిమాకు, మాధవన్ నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది ఎన్‌. లింగుస్వామి దర్శకత్వంలో నటించిన రన్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది.

కాగా మాధవన్ రీసెంట్ గా చేసిన ట్వీట్ తో నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు. మాధవన్, సుర్వీన్ చావ్లా నటించిన కొత్త వెబ్ సరీస్ ‘డీకపుల్డ్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలీసందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సీరిస్ కు మంచి స్పందన వస్తోంది. మన దేశంలోను ఈ వెబ్ సిరీస్ టాప్ 2 లో ఉందని తెలిపాడు. ఇక ఇదే విష్యాని మాధవన్ చెప్పుతూ దీనికి సంబంధించి ఓ ట్విట్ కూడా చేశారు . ఇక అక్కడే అడ్డంగా దొరికిపోయాడు ఈ హీరో. మాధవన్ ట్విట్ చేసిన ఫోటోలో ఆయన గతంలో చూసిన సినిమాలు కూడా బయటలు లీక్ అయ్యాయి. దీంతో అభిమానులు ఆయన ఇలాంటి సినిమాలు కూడా చూస్తారా అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకి ఆయన ఏ సినిమాలు చూసాడో తెలుసా.. జాన్వీకపూర్ నటించిన ‘గుంజన్’, ఆ తర్వాతి రెండు సినిమాలు ‘365 డేస్’, ‘ఫిఫ్టీ షేడ్ష్ ఆఫ్ గ్రే’. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఏరోటిక్ మూవీస్ లో ఆరెండు సినిమాలు మంచి ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అయితే మాధవన్ ఇలాంటి సినిమాలు కూడా చూస్తారా అని అభిమానులు అనుకుంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news