Moviesవామ్మో... హీరోయిన్ శ్రియ క‌ట్టుకున్న చీర రేటు అంతా...!

వామ్మో… హీరోయిన్ శ్రియ క‌ట్టుకున్న చీర రేటు అంతా…!

రెండు దశాబ్దాల క్రితం ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది శ్రేయ. రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ సీనియర్ హీరోల పక్కన ఆమెకు ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్న శ్రేయ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సత్తా చాటుతున్నారు. పెళ్లయినా కూడా శ్రీయ అందం ఏ మాత్రం వన్నె తగ్గలేదు.
కేవలం అందం, అభినయం మాత్రమే కాదు… ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి ఇమేజ్ శ్రేయ సొంతం.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీయ పాత ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. శ్రీయ‌ ఎక్కువగా బ్రాండెడ్ దుస్తులు ధరించేందుకు ఇష్టపడుతూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో శ్రేయ మాట్లాడుతూ తాను ఖరీదైన దుస్తులు… ఆభరణాలు ధరించడం వల్లే తన అందం మరింత పెరుగుతుందని చెప్పింది. నిజమైన అందం అంటే మాత్రం ఆరోగ్యమే అని కూడా తెలిపింది.

ప్రస్తుత జీవన విధానంలో సరైన ఆహారపు అలవాట్లు… మంచి జీవన విధానం ద్వారా మాత్రమే అందంగా కనిపించడం సాధ్యమవుతుందని కూడా పేర్కొంది. ఇక తాజాగా సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో శ్రేయ ధరించిన చీర ఖరీదు ఏకంగా నలభై నాలుగు వేల రూపాయలు కావటం గమనార్హం. ప్రముఖ డిజైనర్ లో ఒకరైన ఆనంద్ క‌బ్రా ఈ చీరను డిజైన్ చేశారు.

ఈ ఫోటోలో శ్రేయాను చూస్తుంటే చాలా ముద్దు చేస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ పక్కన ఆమె కీల‌క పాత్ర‌లో నటిస్తోంది. ఈ పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ సినిమాకు కీల‌కంగా ఉండబోతోందని తెలుస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమాలో శ్రీయ‌ హీరోయిన్గా నటించింది.

మళ్లీ ఇన్ని సంవత్సరాలకు శ్రేయకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు ఇప్పటికే ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అయినా మాత్రం తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కూడా ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news