Moviesసుకుమార్ - బాల‌య్య మూవీపై బ‌న్నీ డైలాగ్ మామూలుగా లేదే...!

సుకుమార్ – బాల‌య్య మూవీపై బ‌న్నీ డైలాగ్ మామూలుగా లేదే…!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బోయ‌పాటి శ్రీను బాల‌య్య‌ది హ్యాట్రిక్ కాంబినేష‌న్ అయ్యింది. ఒకే హీరో, ద‌ర్శ‌కుడు కాంబినేష‌న్లో మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. పైగా ఈ మూడు సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ కొట్టాయి. ప్ర‌స్తుతం బాల‌య్య వ‌రుస పెట్టి క్రేజీ డైరెక్ట‌ర్ల కాంబినేష‌న్లో సినిమాలు ప‌ట్టాలెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాలో న‌టిస్తున్నాడు. శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏప్రిల్ లేదా మే నెల‌లో రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో కూడా బాల‌య్య ఓ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రామానుజాచార్య సినిమా అంటున్నారు.

ఇక వ‌రుస సినిమాల‌తో జోష్‌లో ఉన్న బాల‌య్య బుల్లితెర ఓటీటీ షో అన్‌స్టాప‌బుల్ షోను కూడా తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చేస్తున్నారు. ఈ షోలో తాజాగా పుష్ప టీం హాజ‌రైంది. బ‌న్నీతో పాటు హీరోయిన్ ర‌ష్మిక‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ వ‌చ్చారు. ఆదివారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పంద‌న వ‌స్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.

సుకుమార్‌ను బాల‌య్య సుక్కూ అని పిల‌వ‌డం.. త‌న‌దైన స్టైల్లో బాల‌య్య త‌గ్గేదేలే అని డైలాగ్ చెప్ప‌డం.. పుష్ప అంటే ప్ల‌వ‌ర్ అనుకుంటివా ఫైర్ అని చెప్ప‌డం చూస్తే ప్రోమోతోనే ర‌చ్చ‌లేపిన బాల‌య్య రేపు ఫుల్ ఎపిసోడ్‌లో మ‌రింత ర‌చ్చ చేయబోతున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య ఆరేసుకోబోయి.. ఆకుచాటు పిందె త‌డిసే స్టైల్లో ఫ్యూర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసే అవ‌కాశం ఉందా ? అని క్వ‌శ్చ‌న్ వేశాడు. వెంట‌నే సుక్కు మీరు ఛాన్స్ ఇస్తే చేస్తాన‌ని న‌వ్వుతూ బ‌దులు ఇచ్చాడు.

దీంతో బాల‌య్య మూడే నెల‌ల్లో తీసేద్దాం.. మీకున్న క‌న్‌ఫ్యూజ‌న్‌కు నాకున్న క్లారిటీకి మూడు నెల‌లు చాలు… మూడు నెల‌ల్లో తెర‌మీద బొమ్మ ప‌డాల్సిందే త‌గ్గేదేలే అని అన్నారు. ఆ త‌ర్వాత బ‌న్నీ వ‌చ్చాక మ‌రోసారి పుష్ప 2 అయిపోయాక వ‌చ్చే యేడాది సుక్కు – నేను క‌లిసి మూడే నెల‌ల్లో సినిమా చేస్తున్నాం అని బాల‌య్య చెప్పాడు. ద‌స‌రాకు కొబ్బ‌రికాయ‌, క్రిస్మ‌స్‌కు గుమ్మ‌డికాయ‌, సంక్రాంతికి రిలీజ్ అని చెప్పాడు. దీనికి బ‌న్నీ స్పందిస్తూ మీ చేతిలో ప‌డితే కాని సుకుమార్ సెట్ కాడు అని ఫ‌న్నీగా న‌వ్వాడు.

ఇక ఎక్కువుగా మెగా హీరోల‌తోనే సినిమాలు చేసిన సుకుమార్ నంద‌మూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్‌తో ఒక్క నాన్న‌కుప్రేమ‌తో మాత్ర‌మే చేశాడు. మ‌రి ఇప్పుడు బాల‌య్య లాంటి మాస్ హీరోతో ఛాన్స్ వస్తే ఎలా డీల్ చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news