Gossipsవారెవ్వా..బాలీవుడ్‌లోకి బాలయ్య "అఖండ"..హీరో ఎవరో తెలుసా..?

వారెవ్వా..బాలీవుడ్‌లోకి బాలయ్య “అఖండ”..హీరో ఎవరో తెలుసా..?

ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను ఎక్కువగా రీమెక్ చేస్తున్నారు బాలీవుడ్ దర్శకులు. ఇక్కడ హిట్ అయ్యిన భారీ గా కలెక్షన్స్ రాబట్టిన సినిమాలను అక్కడ వాళ్లు రీమేక్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ కరమంలోనే రీసెంట్ గా బాలయ్య నటించి విడుదలై కోట్ల కలెక్షన్స్ రాబడుతున్న సినిమా “అఖండ”. బోయపాటి స్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటవిశ్వరూపం చూయించారు.

విడుదలకు ముందే ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానుల అంచనాలు నిజం చేస్తూ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకొంది. మురళీకృష్ణ, శివుడిగా ద్విపాత్రాభినయంలో బాలయ్య అదరగొట్టేశారు. ముఖ్యంగా ఇ‘అఖండ’ సినిమ అలో అఘోరగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ టోటల్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇక జై బాలయ్య అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్ తో అద్దిరిపోయింది. సింగర్ గీతా మాధురి వాయిస్ ఈ పాటకు బాగా కలిసొచ్చింది. ఓవర్ ఆల్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో అఖండ టీమ్‌ కు సోషల్‌మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది.

కాగా, తాజాగా అందుతున్న సమాచారం బట్టి బాలయ్య “అఖండ” సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కానుందట. మన సినిమాల పై ఎప్పుడు ఓ కంట కనిపెట్టి ఉన్న బాలీవుడ్ ప్రముఖులు.. కరోనా తర్వాత ఇలా భారీ బోణీ కొట్టిన అఖండ సినిమా చూసి.. ఇప్పుడు ఈ సినిమాని అక్కడ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ ద‌ర్శక‌నిర్మాత సాజిద్ న‌డియాడ్ వాలా హిందీలో రీమేక్ చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా అక్షయ్ కుమార్ అయితే హీరోగా బాగుంటుందని ఆయన అనుకుంటున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news