Moviesకుర్ర హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన‌ ముదురు అనుష్క ..!

కుర్ర హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన‌ ముదురు అనుష్క ..!

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా గత ఏడాది తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. గత ఏడాది రిలీజ్ ఆయన సినిమాల్లో జాతిరత్నాలుకు మంచి లాభాలు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి హిందీలో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్న సమయంలో జాతిరత్నాలులో మంచి అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా హిట్ అవడంతో ఇండస్ట్రీ వర్గాల్లోను… సోషల్ మీడియాలోనూ నవీన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుని ఉంటే న‌వీన్ ఇప్ప‌టికే మూడు నాలుగు సినిమాలు పూర్తి చేసేవాడు. అయితే సరైన క‌థ వచ్చేవరకు తాను వెయిట్ చేస్తాను గాని… తన దగ్గరకు వచ్చిన ప్రతి కథలోను నటించనని చెప్పాడు.

తాజాగా నవీన్ కొత్త సినిమా పై ప్రకటన వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి హీరోగా యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అనుష్క శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే చాలామంది ఈ వార్తలను నమ్మలేదు. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. నవీన్ ప‌క్క‌న‌ అనుష్క నటిస్తుందని అంటే… వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవటం జరిగే పని కాదని చెప్పారు.

అయితే ఇప్పుడు ఆ ప్రచారం నిజం అయింది. నవీన్ పోలిశెట్టి – అనుష్క జంటగా పి మహేష్ బాబు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ – ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. న‌వీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఈ సినిమా గురించి అన్ని విషయాలపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ సినిమా క‌థ‌తో పాటు నవీన్ – అనుష్క పాత్రలు ఎలా ఉండబోతున్నాయో ? ఆసక్తిగా మారింది.

ప్రభాస్ రాధేశ్యామ్ ఫ్రీ రిలీజ్ వేడుక నవీన్ పోలిశెట్టి హోస్ట్ చేశారు. రాధే శ్యామ్ సినిమా పనులు పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించ‌నున్నారు. మరి ఈ కుర్ర హీరోతో ముదురు ముద్దుగుమ్మ అనుష్క ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా ? ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news