Moviesఅందరిముందు అడిగేసిన భాను.."ఇంటికి వచ్చెయ్..ఇస్తా".. అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన...

అందరిముందు అడిగేసిన భాను..”ఇంటికి వచ్చెయ్..ఇస్తా”.. అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆలీ..షాకైన నాగబాబు..!!

ఆలీ.. సినీ రంగంలో ఈ పేరుకు బాగానే క్రేజ్ ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నా కూడా ప్రేక్షకుల మదిలో కొంతమందే టాప్ ప్లేస్ ను సంపాదించుకోగలరు. అలాంటి వారిలో ఆలీ కూడా ఒకరు. ఆలీ ఏం రావడం రావడమే పెద్ద కమెడీయన్ అయిపోలేదు. ఎన్నో కష్టాలు పడి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. కమెడియన్ పేరు సంపాదించుకుని అక్కడ నుంచి హీరోగా గుర్తింపు పొందారు. ఈయన సుమారు 1200 సినిమాల్లో తన దైన స్టైల్లో నటించి ప్రేక్షకులను అల్రించారు. తెర పై ఈయన కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది అని నమ్మే డైరెక్టర్స్ ఇప్పతికి ఉన్నారు అనడంలో సందేహం లేదు.

ఈయన వేసే ఫన్నీ పంచ్ డైలాగులతో ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వులు రావడం పక్క. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆలీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘సీతాకోక చిలుక’ చిత్రంలో ఆలీ నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. హీరోగా ‘యమలీల’ చిత్రంగా మంచి హిట్ తో పాటు క్రేజ్ ను దక్కించుకున్నారు. అలాంటి స్టార్ కమెడియన్ ఆలీ నేడు సినిమాలో కనిపించకపోయిన్నా తనదైన స్టైల్లో పలు కార్యక్రమలల్లో జడ్జీగా వ్యవహరిస్తూ మెప్పిస్తున్నరు. ఇక ఆలీతో సర్దాగా అనే షో కి హోస్ట్ గా కూడా చేస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి సోషల్ మీడియా లో కూడా అభిమానులతో టచ్ లో ఉంటూ దూసుకుపోతున్నారు.

తాజాగా ప్రముఖ ఎంటర్ టన్ మెంట్ ఛానల్ జీ తెలుగులో “దావత్” అనే ప్రోగ్రాం ను కండక్ట్ చేసారు టీం. ఇక ఇది ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఈ క్రమంలో దీనికి సంబంధ్ ఇంచిన ప్రోమోని వదిలారు. “దావత్” కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి నాగబాబు కూడా వచ్చారు. ఇక ఆయన స్టైల్లో యాంకర్ ప్రదీప్ తో ఫన్నీగా మాట్లాడిన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తరువాత ఆలీ ఎంట్రీ ఇస్తాడు. ఇక యాంకర్ ప్రదీప్ దావత్ ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచామంటూ చెప్పగా. నేనెందుకు ఇస్తాను అని ఆలీ ఫన్నీగా మాట్లాడుతారు.

ఇక వెంటనే ప్రదీప్ రీవర్స్ కౌంటర్ గా మీరు ఎవరు ఏం అడిగిన ఇస్తారు కదా సర్ అని అంటాడు. ఇక ఆలీ తనదైన స్టైల్లో మాట్లాడుతూ ఎవరు ఏం అడిగినా ఇచ్చేయడానికి నేను పవన్ కళ్యాణ్ కాదు.. అతని ఫ్రెండ్ ని అంటూ చెప్పగా వెంటనే అక్కడ విజిల్స్ వేస్తూ అభిమానులు సందడి చేస్తారు. ఇక అక్కడే ఉన్న యాంకర్ భాను శ్రీ మధ్యలో మాట్లాడుతూ “ఆలీ గారు ప్లీజ్ దావత్ ఇవ్వరా” అని నవ్వుతూ అడగడంతో ఆలీ “వచ్చేసేయ్ మా ఇంటికి” అంటూ కామెడీ గా అంటాడు. దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news