Movies' అఖండ ' ప్రీమియ‌ర్ షో టాక్‌.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌..

‘ అఖండ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌..

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సింహా – లెజెండ్ లాంటి హిట్ సినిమాల తర్వాత బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా అఖండ. ఈ సినిమాతో ఖ‌చ్చితంగా బాల‌య్య‌, బోయ‌పాటి హ్యాట్రిక్ కొడ‌తార‌నే అంద‌రూ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్లు, సాంగ్స్‌తో అఖండ‌కు మంచి హైప్ వ‌చ్చింది.

ఇక ఈ సినిమా హైద‌రాబాద్ భ్ర‌మ‌రాంబ‌, మ‌ల్లిఖార్జున థియేట‌ర్ల‌లో ఫ‌స్ట్ షో ప‌డింది. ఇప్ప‌టికే షోలు కంప్లీట్ అయ్యాయి. సినిమాకు మంచి టాక్ వ‌స్తోంది. అఖండ ఫస్ట్ హాఫ్ చాలా పవర్ ఫుల్ గా ఉంద‌ని సినిమా చూసిన వాళ్లు చెపుతున్నారు. అయితే నిడివి కాస్త ఎక్కువ ఉన్నట్టు అనిపించినా.. బాల‌య్య‌ను బోయ‌పాటి చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా చూపించాడ‌ని అంటున్నారు.

బాల‌య్య మామూలు గెట‌ప్‌తో పాటు అఘోరాగా అద‌ర గొట్టేశాడు. అయితే బోయ‌పాటి క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా కూడా మైండ్ బ్లాక్ అయిపోయేలా బాల‌య్య‌ను ఎలివేట్ చేయ‌డంతో పాటు సినిమా గ్రాఫ్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా చూసుకున్నాడ‌ట‌. బోయ‌పాటి ప్ర‌జెంటేష‌న్‌కు తోడు, ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌, ఎలివేష‌న్‌.. ట్విస్టులు సినిమాకు హైలెట్ అని చెపుతున్నారు.

అలాగే బాల‌య్య‌కు త‌న త‌ల్లికి మ‌ధ్య వ‌చ్చే సెంటిమెంట్ సీన్లు ఎమోష‌న‌ల్‌గా బాగున్నాయి. ఏదేమైనా సింహా, లెజెండ్ త‌ర్వాత బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో ఇది హ్యాట్రిక్ హిట్ అని చెపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news