Moviesపాఫం నాగార్జున‌కే ఎందుకు ఇన్ని క‌ష్టాలు... గ్ర‌హ‌చారం బాగోలేదా..!

పాఫం నాగార్జున‌కే ఎందుకు ఇన్ని క‌ష్టాలు… గ్ర‌హ‌చారం బాగోలేదా..!

పాపం నాగార్జున గత పదేళ్ళలో చూస్తే నాగార్జున కేరీర్‌ ఏమంత ఆశాజనకంగా లేదు. ఒక సోగ్గాడే చిన్నినాయన సినిమా, మనం మాత్రమే కాస్త పర్లేదు అనిపించాయి. మన్మథుడు 2 నాగార్జున పరువు ఘోరంగా తీసేసింది. పోయి పోయి వర్మ తీసిన ఆఫీస‌ర్ సినిమా భయానకంగా అనిపించింది. ఈ సినిమా నాగార్జున కలలోకి వచ్చి భ‌య‌పెట్టేంత ఘోరంగా ఉంది. ఇక వ్యక్తిగతంగానూ నాగార్జున ఇబ్బందుల్లో నే ఉన్నాడు. అఖిల్ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. పెద్ద కొడుకు చైతు వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది.

కొద్దిగా ఊర‌ట‌ ఏంటంటే వీరిద్దరికీ లవ్ స్టోరీ, ఎలిజబుల్ బ్యాచిలర్ రూపంలో రెండు హిట్ సినిమాలు పడ్డాయి. ఇక తన కుటుంబ సభ్యుడే అయిన సుమంత్ కెరీర్ కూడా ఏమాత్రం బాగోలేదు. నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కూడా ప్లాప్ రేటింగుల‌తోనే నడుస్తోంది. ఇప్పటికే నాగార్జున వయసు 62 ఏళ్లు. ఈ మధ్యలో ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా సక్సెస్ అవ్వడం లేదు.

తాజాగా నాగార్జునకు షాక్ ఇచ్చేలా మరో సంఘటన జరిగింది. ఆయన నటించిన వైల్డ్ డాగ్‌కు వచ్చిన రేటింగ్ ఘోరాతి ఘోరంగా ఉంది. వైల్డ్ డాగ్ వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ థియేటర్ లోకి వచ్చింది. సినిమా కథ అంతా సీరియస్‌గానే ఉంటుంది. యాంటీ టెర్ర‌రిస్ట్ ఆపరేషన్ క‌థాంశంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో దియామీర్జా, స‌యామీ ఖేర్ లాంటి వాళ్లు కూడా అదనపు హంగులు అద్దారు.

సినిమా ఎక్కడ కమర్షియల్ హంగులు జోలికి పోకుండా స్ట్రైట్‌గా క‌థ‌మీదే ఉంటుంది. మ‌రీ తీసేయ‌ద‌గ్గ సినిమానూ కాదు. అయినా ఎందుకు ప్రేక్షకులకు నచ్చలేదు. తాజాగా ఈ సినిమాను ఈనెల 7వ తేదీన జెమినీ టీవీ లో వేశారు. బార్క్ రేటింగ్లో ఈ సినిమాకి చాలా ఘోరంగా నాలుగు టిఆర్పి మాత్రమే దక్కింది.
విచిత్రమేంటంటే ఎన్నో ప్లాప్ సినిమాలను కూడా టీవీలో పదేపదే వేస్తుంటే 7-8 రేటింగ్స్ వస్తూ ఉంటాయి.

అలాంటిది ఏకంగా వైల్డ్ డాగ్‌ను ప్రీమియ‌ర్‌గా వేసినా కూడా 4 రేటింగ్ రాలేదంటే నాగార్జున కెరీర్‌ దాదాపు ముగింపు దశకు వచ్చేసిందా అన్న సందేహాలు వ్యక్తం కాక తప్పదు. వెంకటేష్ దృశ్యం, నార‌ప్ప లాంటి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తుండడంతో పాటు సీనియార్టీ నిలుపుకుంటున్నారు. నాగ్ ముత‌క క‌థ‌ల‌తో సినిమాలు చేస్తుంటే ఆయ‌న సినిమాల‌నే కాదు.. ఆయ‌న్ను కూడా ప్రేక్ష‌కులు మ‌ర్చిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news