Moviesశివ‌బాలాజీతో మ‌ధుమిత పెళ్లికి నో చెప్పింది ఎవ‌రు.. ఇన్ని క‌ష్టాలు ప‌డ్డారా...

శివ‌బాలాజీతో మ‌ధుమిత పెళ్లికి నో చెప్పింది ఎవ‌రు.. ఇన్ని క‌ష్టాలు ప‌డ్డారా ..!

శివ‌బాలాజీ తెలుగు సినిమా రంగంలో రెండు ద‌శాబ్దాల‌కు పైగా కొన‌సాగుతున్నారు. సినిమా రంగంపై ఆస‌క్తితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన శివ‌బాలాజీ అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ సినిమాతో వెండితెరంగ్రేటం చేశారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ 1 విజేత‌గా నిలిచిన మ‌నోడికి తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. ఇక మా ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా పోటీ చేస్తూ వ‌స్తోన్న శివ‌బాలాజీ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ఫ్యానెల్ నుంచి పోటీ చేసి వ‌రుస‌గా విజ‌యం సాధించారు.

ఇక శివ‌బాలాజీ త‌న స‌హ‌న‌టి మ‌ధుమిత‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. త‌న తాజా ఇంట‌ర్వ్యూలో శివ‌బాలాజీ మ‌ధుమిత‌తో ప్రేమ వివాహం.. దాని వెన‌క ఉన్న ఇంట్ర‌స్టింగ్ స్టోరీని రివీల్ చేశాడు. శివ‌బాలాజీతో మ‌ధుమిత వివాహాన్ని ముందుగా మ‌ధుమిత త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేద‌ట‌. శివ‌బాలాజీకి బాగా కోపం ఎక్కువ‌న్న కార‌ణంతోనే మ‌ధుమిత కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేద‌ట‌. త‌ర్వాత వీరి ప్రేమ‌ను అర్థం చేసుకున్నాక వారు ఈ పెళ్లికి ఒప్పుకున్నార‌ట‌.

ఇక పెళ్లికి ముందే చాలా యేళ్ల పాటు శివ‌బాలాజీ – మ‌ధుమిత ప్రేమించుకున్నార‌ట‌. ఇక మ‌ధుమిత వంట‌లు బాగా చేస్తుంద‌ట‌. ఇక పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేయాల‌ని మ‌ధు కుటుంబం నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. అయితే శివ‌బాలాజీ మాత్రం ఆలోచించుకోమ‌ని చెప్పాడ‌ట‌. అయితే పెళ్ల‌య్యాక మ‌ధుమిత క్యారెక్ట‌ర్ల విష‌యంలో ప‌ర్టిక్యుల‌ర్ అయిన‌ట్టు బాలాజీ చెప్పాడు. ఇక క‌రోనా స‌మ‌యంలో మూడు నెల‌ల పాటు ఫామ్‌హౌస్‌లోనే తాను, మ‌ధుమిత‌ గ‌డిపామ‌ని శివ‌బాలాజీ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news