Moviesఅరెస్ట్ చేసేందుకు వ‌స్తే..నా మూడ్ ఇదే ..కంగనా సంచలన పోస్ట్..!!

అరెస్ట్ చేసేందుకు వ‌స్తే..నా మూడ్ ఇదే ..కంగనా సంచలన పోస్ట్..!!

కంగ‌నా ర‌నౌత్..ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎంత చెప్పిన అది తక్కువనే అనిపిస్తుంది. బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఆమెకు అది అల‌వాటుగా మారిపోయింది ఏమో అని అంటుంటారు కొందరు నెటిజన్లు. నార్త్‌లో కంగ‌నా కాంట్ర‌వ‌ర్సీ కి కేరాఫ్ అడ్రెస్స్ గా అయిపోయింది. ఆమె బీజేపీ మాట‌ల‌నే చెపుతున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఆమె బీజేపీ ప్రాప‌కంతోనే ప‌ద్మ అవార్డును కూడా గెలుచుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఇది వరకే మనం విన్నాం.

కాగా రీసెంట్ గా కంగనా రనౌత్‌ మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. తమ మనోభావాలను దెబ్బతీసేలా కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతున్నారంటూ సిక్కులు ముంబయిలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కంగనాపై పోలీసు కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సాగు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కంగనా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సరిహద్దులో ఏకధాటిగా నిరసనలు చేస్తున్న కాళిస్తానీలతో పోలుస్తూ పోస్ట్ పెట్టింది. ఇది నచ్చని సిక్ మతస్థులు తనపై కేసు నమోదు చేయించారు.

అయితే దీని పై కంగనా పరోక్షంగా స్పందించింది. తాజాగా దీనిపై ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టుకోచ్చింది. ఆ స్టోరీలో కంగ‌నా పెట్టిన పోస్ట్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఆ స్టోరీలో బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న కంగ‌నా..తన చేతిలో వైన్ గ్లాస్ ప‌ట్టుకుని తన బ్యాక్ చూపిస్తున్నట్లు ఓ స్టిల్ పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్ ఇస్తూ.. “మ‌రొక రోజు మ‌రో ఎఫ్ఐఆర్‌. ఒక‌వేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వ‌స్తే..ఇంటి ద‌గ్గ‌ర నా మూడ్ ఇదే” అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news