Moviesసూప‌ర్‌స్టార్ కృష్ణ - ఎస్పీ. బాలు మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మేంటి.. ఏం...

సూప‌ర్‌స్టార్ కృష్ణ – ఎస్పీ. బాలు మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మేంటి.. ఏం జ‌రిగింది…!

సూప‌ర్‌స్టార్ కృష్ణ కేవ‌లం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మాత్ర‌మే కాదు.. యావ‌త్ భార‌త‌దేశ సినిమా ఇండ‌స్ట్రీ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఒక‌రు. ఇక గాన గంధ‌ర్వ ఎస్పీ. బాల సుబ్ర‌హ్మ‌ణ్యం దేశంలో ఎన్నో భాష‌ల్లో వేలాది సినిమా పాట‌లు పాడారు. బాలు ఇప్పుడు మ‌న మ‌ధ్యలో లేక‌పోయినా ఆయ‌న పాట‌లు మాత్రం ఎప్ప‌ట‌కీ మ‌న ప్రేక్ష‌కుల మ‌దిలో అలా నిలిచిపోయాయి. ఏ హీరోకు ఏ గొంతుతో పాట పాడాలో తెలిసిన ఒకే ఒక సింగర్ బాలు.

ఇక కృష్ణ సినిమాలు అన్నింటికి ముందు బాలుయే పాటలు పాడేవాడు. అయితే వీరి మ‌ధ్య ఓ సంద‌ర్భంలో జ‌రిగిన గొడ‌వ‌తో బాలు కృష్ణ సినిమాల‌కు పాట‌లు పాడ‌డం మానేశాడు. ఈ త‌రం జ‌న‌రేష‌న్ వాళ్ల‌కు ఈ గొడ‌వ ఏంట‌న్న‌ది పెద్ద‌గా తెలియ‌దు. ప‌ద్మాల‌య శ‌ర్మ ఓ ఇంట‌ర్వ్యూలో ఈ గొడ‌వ‌కు కార‌ణం చెప్పారు. ఇందిరాగాంధీ గురించి వింధ్యా కృష్ణ బ్యాన‌ర్లో ఓ బుర్ర క‌థ చేయ‌గా.. దానికి ఎస్పీ బాలు ప్లే బ్యాక్ ఇచ్చార‌ట‌. కృష్ణ‌తో పాటు విజ‌య‌నిర్మ‌ల‌కు కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఎక్కువ అట‌. అయితే ఆ ప్లే బ్యాక్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ట‌. అయితే అప్ప‌ట్లో పేమెంట్స్ స్లోగా జ‌ర‌గ‌డంతోనే ఈ స‌మ‌స్య వ‌చ్చింద‌ని ప‌ద్మాల‌య శ‌ర్మ చెప్పారు.

ఆ త‌ర్వాత కృష్ణ త‌న సినిమాల్లో పాట‌ల‌ను రాజ్ సీతారాంతో పాడించ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత బాలు కూడా ఈ వివాదంపై స్పందించారు. ఓ సారి కృష్ణ‌గారు త‌న‌కు ఫోన్ చేసి మీరు పాట‌లు పాడ‌క‌పోతే సినిమాలు హిట్ అవ్వ‌వా అని మాట్లాడార‌ని.. ఆ మాట‌లు త‌న‌ను ఎంతో బాధించాయ‌ని బాలు అప్పుట్లో చెప్పారు. సింహాస‌నం సినిమాలో బాలుకు పోటీగానే అన్ని పాట‌లు రాజ్‌సీతారాంతో పాడించారు. అవి అప్ప‌ట్లో పెద్ద హిట్ అయ్యాయి. ఆ త‌ర్వాత బాలు – కృష్ణ పాత గొడ‌వ‌లు మ‌రిచిపోయి మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news