Moviesవారెవ్వా..సరికొత్త చరిత్ర సృష్టించిన బన్నీ.. టాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్న స్టైలీష్ స్టార్...

వారెవ్వా..సరికొత్త చరిత్ర సృష్టించిన బన్నీ.. టాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్న స్టైలీష్ స్టార్ ..!!

బన్నీ..అల్లు అర్జున్ ను తన అభిమానులు ప్రేమ గా పిలుచుకునే పేరు. మెగాస్టార్ మేనల్లుడుగా సినీ ఇండస్ట్రీల్లోకి అడుగు పెట్టినా..తనలోని టాలెంట్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టైలీష్ స్టార్. అల్లు అర్జున్ ఇప్పటి సినిమాలకు తను తెరంగేట్రం చేసిన గంగోత్రి సినిమాకు చూసుకుంటే.. ఈ అబ్బాయేనే ఇది అని ఖచ్చితంగా అంటారు. అంతలా తన ప్రతి సినిమాకు బన్నీ ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నాడు.

ఇక ఈ ఐకాన్ స్టార్ డాషింగ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే మూవి చేస్తున్నా విషయం తెలిసిందే. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న సుక్కు.. ఇప్పటికే పలు పోస్టర్స్, వీడియోస్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. బన్నీ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప’ నుంచి వస్తున్న ఒక్కో అప్‌డేట్ తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు హద్దుల్లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్రంలోని ‘సామీ సామీ’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి మరింత హూషారెత్తించారు.

రీసెంట్‌గా ఈ సినిమా నుంచి వచ్చిన ”దాక్కొదాక్కొ మేక, శ్రీవల్లి” పాటలు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా విడుదలైన ‘సామీ సామీ’ సాంగ్ వేరే లెవెల్ అంతే అనిపించుకుంటోంది. క్లాసికల్ టచ్ ఇస్తూనే మాస్ ట్రీట్ ఇచ్చారు సుకుమార్. ఈ పాటలో పల్లెటూరి లొకేషన్స్, అల్లు అర్జున్- రష్మిక కట్టు బొట్టు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాట రికార్డులు తిరగరాస్తోంది. అత్యధిక వ్యూస్ అత్యంత వేగంగా సాధించిన పాటగా సౌత్ ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది సామి సామి సాంగ్. విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news