Movies' అఖండ ' బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డానికి ఆ ఒక్క‌టి చాలు.. అదే...

‘ అఖండ ‘ బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డానికి ఆ ఒక్క‌టి చాలు.. అదే అంత స్పెష‌ల్‌

యువరత్న నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా అఖండ. మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ‌. క‌రోనా సెకండ్ వేవ్‌ తర్వాత థియేటర్లలోకి వస్తున్న పెద్ద సినిమాగా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అఖండ అమెరికాలో బాలయ్య చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 500 స్క్రీన్ల‌లో రిలీజ్‌ కాబోతుంది.

అఖండపై రెండు తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ అదిరిపోయే అంచనాలు ఉన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. శనివారం శిల్పకళా వేదికలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్ – రాజమౌళి ముఖ్య అతిథులుగా వచ్చారు. దీంతో నందమూరి అభిమానులు జోష్‌ మామూలుగా లేదు. ఇక బాలయ్య బోయపాటి కాంబోలో ఇది హ్యాట్రిక్ సినిమా కావడంతో అంచనాలు కూడా వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి.

ఇక బాల‌య్య ఇమేజ్ మ్యాచ్ చేస్తూ బోయ‌పాటి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు ట్రైల‌ర్లు, స్టిల్స్ చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్ష‌న్ నుంచి మ్యూజిక్ వ‌ర‌కు అన్ని అవుట్ స్టాండింగ్ రేంజ్‌లో ఉన్నాయి. ఇక నిన్న ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌లో రిలీజ్ చేసిన సూప‌ర్ స్పెష‌ల్ సాంగ్ జై బాల‌య్య అయితే మ‌ళ్లీ బాల‌య్య ఫ్యాన్స్‌ను పాత రోజుల‌కు తీసుకు వెళ్లిపోయింది.

థ‌మ‌న్ అదిరిపోయే మ్యూజిక్‌కు తోడు బాల‌య్య వేసిన సిగ్నేచ‌ర్ స్టెప్స్ కూడా దుమ్ము దులిపేశాయి. ఏదేమైనా ఈ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ అయితే వ‌చ్చింది. ఇదే రేపు సినిమాలో హైలెట్ కావ‌డంతో పాటు అఖండ‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తుంద‌ని కూడా చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఇక బాల‌య్య ఫ్యాన్స్ సూప‌ర్ ఫీస్ట్‌కు రెడీ అయిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news