Moviesఅల్లు అరవింద్ పెద్ద కొడుకు బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఇంత హిస్ట‌రీ ఉందా..!

అల్లు అరవింద్ పెద్ద కొడుకు బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఇంత హిస్ట‌రీ ఉందా..!

ప్రముఖ మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల కు సంబంధించిన అన్ని సినిమాలకు కూడా దాదాపుగా అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. సాధారణంగా చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే, అల్లుఅరవింద్ కొడుకులు ఇద్దరు అని, కానీ ఆయనకు ముగ్గురు కొడుకులు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ ను సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి.. ఈయన.. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా రంగాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన బాబి గీత ఆర్ట్స్ నిర్మించే సినిమాలకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్నారు.. అంతేకాదు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఆన్లైన్ మూవీ టికెట్ పోర్టల్ ను కూడా ప్రారంభించాడు.

అల్లు బాబి విదేశాల్లో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. టెక్నాలజీ ఇంటర్ ప్రిటర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన 15 సంవత్సరాల పాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ తో పాటు ఐటీ రంగం అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు. ఇక ఈయన పేరు అల్లు వెంకటేష్ కాక అందరూ ముద్దుగా బాబి అని పిలుచుకుంటారు . ఇక ప్రస్తుతం జస్ట్ టికెట్స్ కు చైర్మన్‌గా ఉన్నారు.

అంతేకాదు అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన ఆహా ఓటీటీ సక్సెస్ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. అంతేకాదు తమ్ముళ్ళు ఇద్దరూ సినిమా రంగంలో సక్సెస్ కావడానికి కూడా ఈయన వెనకనుంచి నడుపుతున్నట్టు సమాచారం. సినిమా రంగంలో కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఈయన, గని సినిమాతో నిర్మాతగా సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటారో లేదో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news