Moviesనాగార్జున త‌న హిట్‌ సినిమాల‌కు ఇచ్చుకున్న రేటింగ్స్ ఇవే..!

నాగార్జున త‌న హిట్‌ సినిమాల‌కు ఇచ్చుకున్న రేటింగ్స్ ఇవే..!

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మూడు దశాబ్దాలుగా పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగార్జున వయస్సు 62 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ 26 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ఉంటారు. నాగార్జున ఈ వయసులోనూ ఇంత యంగ్‌గా కనిపించడానికి తాను తీసుకునే జాగ్రత్తలతో పాటు భార్య అమ‌ల‌ కూడా నాగ్‌ ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. నాగ్‌ ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా జిమ్ చేయటం మానడు. అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలతో ఉంటారు. అందుకే ఈ వయసులోనూ మూడు పదుల వ‌య‌స్సులో ఉన్న‌ట్టు కనిపిస్తూ ఉంటారు.

ఇక నాగార్జున తాను నటించిన సినిమాల్లో తనకు అన్నమయ్య క్లైమాక్స్ బాగా నచ్చుతుందని చెప్పారు. తాను నటించిన సినిమాలకు మీరు రేటింగ్ ఎంత ఇస్తార‌ని ప్రశ్నిస్తే అందుకు ఆసక్తికరమైన ఆన్సర్లు ఇచ్చాడు. తాను ఎంతో ఇష్టపడి వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నటించిన అన్నమయ్య సినిమాకు 5 రేటింగ్ ఇచ్చుకున్నాడు. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన శివ సినిమా కూడా సూప‌ర్ అంటూ 5 రేటింగ్ ఇచ్చాడు.

ఇక మణిరత్నం దర్శకత్వంలో నటించిన గీతాంజలి సినిమాకు కూడా 5 రేటింగ్ ఇచ్చారు. నిన్నే పెళ్ళాడుతా, మ‌న్మ‌థుడు సినిమాల‌కు మాత్రం 4 రేటింగ్ ఇచ్చారు. ఇందుకు నాగార్జున కారణం కూడా చెప్పాడు. ఈ రెండు సినిమాలు ఎంత బాగున్నా క్లైమాక్స్ తనకు నచ్చలేదని చెప్పాడు. ఇక మన్మధుడు సినిమాకు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించగా.. నిన్నేపెళ్ళాడతాకు కృష్ణవంశీ దర్శకుడు.

ఇక నాగ్ ప్ర‌స్తుతం ఇద్ద‌రు కొడుల‌కు రెండు హిట్ సినిమాలు ప‌డ‌డంతో ఫుల్ హుషారుగా ఉన్నాడు. చైతు న‌టించిన ల‌వ్ స్టోరీ, అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news