Moviesఐదుగురు హీరోల‌తో సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిన స్టార్ హీరోయిన్‌..!

ఐదుగురు హీరోల‌తో సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిన స్టార్ హీరోయిన్‌..!

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రస్తుతం విక్కీ కౌశల్ తో ప్రేమ‌లో మునిగి తేలుతోంద‌న్న వార్త నేష‌న‌ల్ వైడ్‌గా ఎంత‌లా హాట్ టాపిక్‌గా మారిందో తెలిసిందే. ఈ జంట విదేశీ టూర్లూ, బీచ్‌ల‌లో సంద‌డి, ముంబైలో సినిమాలు, షికార్లు మామూలుగా ఎంజాయ్ చేయ‌డం లేదు. పైగా బాలీవుడ్లో సెల‌బ్రిటీల పార్టీల‌కు కూడా వీరు చెట్టాప‌ట్టాలేసుకుని హాజ‌రు అవుతున్నారు. ఇక విక్కీ కూడా క‌త్రీనాతో పోలిస్తే వ‌య‌స్సులో చాలా చిన్న‌వాడే.

ఇక వీరిద్ద‌రు డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వీరు నిజంగానే ల‌వ్‌లో ఉన్నారా ? అన్న‌ది మాత్రం అధికారికంగా తెలియ‌దు. ఇక క‌త్రీనా విష‌యానికి వ‌స్తే ఆమె విక్కీతో కాదు.. గ‌తంలోనే న‌లుగురు స్టార్ హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపింది. క‌త్రినా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లోనే కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో ఘాటుగా ప్రేమాయ‌ణం న‌డిపింది. వారిద్ద‌రు ఎక్క‌డా చూసినా వాలిపోయేవారు. అయితే కెరీర్ కోస‌మే క‌త్రీనా స‌ల్మాన్‌ను ప‌క్క‌న పెట్టేసింద‌ని అంటారు.

ఆ త‌ర్వాత లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా త‌న‌యుడు సిద్ధార్థ్ మాల్యాతో ఫుల్లుగా డేటింగ్‌లో మునిగి పోయింద‌న్న ప్ర‌చారం ఉంది. ఎక్క‌డ చూసినా ప్రేమప‌క్షుల్లా వీరే క‌న‌ప‌డేవారు. ఐపీఎల్ టైంలో క‌త్రీనా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టుకు స‌పోర్ట్ చేసింది. వీరు క‌లిసి మ్యాచ్‌లు చూడ‌డంతో పాటు ప్రైవేటు పార్టీల్లో పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేసేవారు. ఆ త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ఆమె చాలా రోజుల పాటు సీరియ‌స్‌గా ల‌వ్వాయ‌ణం కొన‌సాగించింది.

ఆ త‌ర్వాత ఆమె కిలాడీ కింగ్ , సీనియ‌ర్ హీరో అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి చాలా సినిమాలు చేసింది. ఆ స‌మ‌యంలో వీరి మ‌ధ్య ఎఫైర్ న‌డిచిన‌ట్టు టాక్ ఉంది. అలా క‌త్రీనా ల‌వ్ స్టోరీల‌తో మాత్రం ఎప్పుడూ బీ టౌన్‌లో టాక్ ఆఫ ద టౌన్‌గానే ఉంటూ వ‌చ్చింది. ఇక ఇప్పుడు విక్కీ కౌశ‌ల్‌తో ప్రేమాయ‌ణం హాట్ టాపిక్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news