Moviesమ‌హేష్‌బాబును ఫిదా చేసిన స్టార్ హీరోయిన్ ఫుడ్ ఐటెంలు..

మ‌హేష్‌బాబును ఫిదా చేసిన స్టార్ హీరోయిన్ ఫుడ్ ఐటెంలు..

జెనీలియా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. బొమ్మ‌రిల్లు సినిమాలో హాసిని క్యారెక్ట‌ర్‌తో మ‌న తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో అలా నిలిచిపోయింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడే తెలుగులో మంచి అవ‌కాశాలు ద‌క్కించుకున్న ఆమె ఇక్క‌డ చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. సై – హ్యాపీ – బొమ్మరిల్లు – ఢీ – ఆరెంజ్ సినిమాలు ఆమె న‌ట‌న‌ను బ‌య‌ట పెట్టాయి.

ఆ త‌ర్వాత ఆమె మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ త‌న‌యుడు రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ల‌య్యాక వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోన్న ఆమె తిరిగి సినిమాల్లోకి రాలేదు. అయితే ఆమె తెలుగు హీరోల‌తో త‌న స్నేహాన్ని కంటిన్యూ చేస్తోంది. ఇటీవ‌లే ఆమె మా ఎన్నిక‌ల్లో ఓటేసింది కూడా..!

ఇక జెనీలియా దంప‌తులు ఇమేజిన్ మీట్స్ పేరుతో ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి.. దీని ప్ర‌మోష‌న్ల‌లో బిజీఆ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు స‌న్నిహితంగా ఉన్న సెల‌బ్రిటీల‌కు ఈ ఫుడ్ ఐటెంలు పంపుతున్నారు. ఈ క్ర‌మంలోనే జెనీలియా దంపతుల నుంచి మహేశ్ బాబుకు ఫుడ్ ఐటమ్స్ పంపారు. వీటిపై మ‌హేష్ త‌న ఇన్‌స్టాలో స్పందించారు.

ఇమేజిన్ మీట్స్ ప్యాకేజ్ ఇమేజ్ త‌నను చాలా ఇంప్రెస్ చేశాయ‌ని చెప్పిన మ‌హేష్‌.. వాటిని ఎప్పుడు టేస్ట్ చేయాలా అని ఎంతో ఉత్సుక‌త‌తో ఉన్నాన‌ని.. వాటిని టేస్ట్ చేయుండా వెయిట్ చేయ‌డం కూడా త‌న వ‌ల్ల కాద‌ని చెప్పేశాడు. ఇక ఈ ఫుడ్ ఐటెంల‌ను త‌న‌పై అభిమానంతో పంపిన జెనీలియా దంప‌తుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన మ‌హేష్ వారి వ్యాపారం బాగుండాల‌ని శుభాకాంక్ష‌లు చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news