Moviesఆడవాళ్లకే కాదు.. మగవాళ్ళకు కూడా అది ఇంపార్టెంటే..!!

ఆడవాళ్లకే కాదు.. మగవాళ్ళకు కూడా అది ఇంపార్టెంటే..!!

సంపూర్ణేష్‌ బాబు… ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో ,కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగ్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘హృదయ కాలేయం’ అనే సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మైయిన ఈయన ఆ తరువాత ఎన్నీ సినిమాల్లో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయిన కామెడీ పరంగా ఆ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాయి. దీంతో బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు హైలెట్ అయ్యారు.

ఇప్పటికే ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’, ‘బజార్‌ రౌడీ’ వంటి చిత్రాలతో సోలో హీరోగా మెప్పించాడు సంపూర్ణేష్‌. తనదైన కామెడీ స్ఫూప్‌లతో ఆకట్టుకుంటోన్న ఈ హీరో త్వరలో ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త సినిమాతో మ‌న‌ముందుకు రానున్నాడు ప్రస్తుతం ఈయన ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు వస్తున్న సంపూర్ణేష్‌బాబు.. ఈ సినిమాతో ఖచ్చితంగా మనల్ని నవ్విస్తా అంటున్నారు. ఇక ఈ ‘క్యాలీ ఫ్లవర్‌’ సినిమాలో ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. పేరు ను చూస్తుంటేనే ఈ సినిమాలో కామెడీ ఎలా ఉంటుందో అర్ధమైపోతుంది.

ఈ సినిమాని గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు.. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో హీరో సంపూర్ణేష్‌బాబు సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను అన్నారు. “ఇందులో కొత్తగా కనిపిస్తాను. కొబ్బరిమట్టలో చెప్పినట్టుగా భారీ లెంగ్తీ డైలాగ్స్ ఉండవు. కోర్ట్ సీన్‌లో మాత్రం అలాంటి డైలాగ్స్ ఉంటాయి. శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది నాకు చాలా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను”..అంటూ చెప్పుకోచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news