Moviesకోహ్లీ ఇంత మంది స్టార్ హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపాడా... లిస్ట్ ఇదే..!

కోహ్లీ ఇంత మంది స్టార్ హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపాడా… లిస్ట్ ఇదే..!

భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ‌న దేశంలో మాత్ర‌మే కాదు… ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక సోష‌ల్ మీడియాలో కోహ్లీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. త‌న బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డుల‌ను ఫ‌టాఫ‌ట్ బ‌ద్ద‌లు కొట్టిన కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌ను 2018లో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు పెళ్లికి ముందే డేటింగ్ చేసిన‌ట్టు కూడా రూమ‌ర్లు ఉన్నాయి.

ఇక అనుష్క కంటే ముందే కోహ్లీ ప‌లువురు స్టార్ హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు ట్రెండ్ అయ్యాయి. కోహ్లీ ప‌లువురు హీరోయిన్ల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. కోహ్లీ పెళ్లికి ముందే డేట్ చేసిన హీరోయిన్ల లిస్ట్ ఇలా ఉంది.

1- త‌మ‌న్నా:
త‌మ‌న్నా 2012లో కోహ్లీతో ఓ ప్ర‌క‌ట‌న‌లో న‌టించింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య కొన్నేళ్ల పాటు ప్రేమాయ‌ణం న‌డిచింద‌న్న రూమ‌ర్ ఉంది. ఆ త‌ర్వాత ఇది బ్రేక‌ప్ అయ్యిందంటారు. అయితే ఇప్ప‌ట‌కీ కోహ్లీ – త‌మ‌న్నా స్నేహితులుగానే ఉంటారు. ఎంపీఎల్ యాప్ కోసం విరాట్ – త‌మ‌న్నా జోడీ మ‌రోసారి ప్ర‌క‌ట‌న‌లో న‌టించారు.

2- ఇజాబెల్లి లైట్:
మిస్టర్ మజ్నూ, వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాల్లో నటించిన ఇజాబెల్లీ మ‌న‌కు తెలిసిన అమ్మాయే. వీరిద్ద‌రు సింగ‌పూర్‌లో చ‌క్కెర్లు కొడుతూ చ‌క్కెర్లు కొడుతూ మీడియా కంట ప‌డ్డారు. ఒక పార్టీలో క‌లిసిన వీరిద్ద‌రు క‌లిసి కొద్ది రోజుల పాటు డేట్ చేశారు. త‌ర్వాత వీరు వేర్వేరు భాగ‌స్వాముల‌ను వెతుక్కున్నారు.

3- సంజన గల్రానీ:
కొన్నాళ్ల కిందట డ్రగ్స్ మాఫియాలో అరెస్టైన కన్నడ నటి సంజన గల్రానీతో కోహ్లీ ప్రేమాయ‌ణం న‌డిపాడ‌న్న టాక్ ఉంది. సంజ‌న‌తో అప్ప‌ట్లో కోహ్లీ టెన్నీస్ ఆడ‌డ‌డంతో పాటు లాంగ్ డ్రైవ్‌ల‌కు కూడా వెళ్లేవాడు. ఈ ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

4- సారాజేన్ డ‌యాన్‌:
ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంజా సినిమాలో న‌టించిన సారాజేన్ డ‌యాన్ గుర్తుండే ఉంటుంది. ఆమెతో కూడా మ‌నోడు కొద్ది నెల‌ల పాటు డేట్ చేశాడ‌న్న రూమ‌ర్ ఉంది. ఆమెతో పాటు సాక్షి అగ‌ర్వాల్ తో కూడా కోహ్లీ ప్రేమాయణం నడిపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news