Moviesక‌త్రినా కైఫ్‌కు అన్ని కోట్ల ఆస్తా... ఒక్క సినిమాకు ఎన్ని కోట్లో...

క‌త్రినా కైఫ్‌కు అన్ని కోట్ల ఆస్తా… ఒక్క సినిమాకు ఎన్ని కోట్లో తెలుసా..

క‌త్రినా కైఫ్ త‌న అందంతో యావ‌త్ దేశాన్ని ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా ఓ ఊపు ఊపేస్తోంది. ముదురు వ‌య‌స్సు వ‌చ్చినా కూడా క‌త్రినా అందం ఏ మాత్రం వ‌న్నె త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. తెలుగులో క‌త్రినా కేవ‌లం రెండు సినిమాల్లో మాత్ర‌మే న‌టించినా ఆమెకు ఇక్క‌డ కూడా విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. క‌త్రినా తెలుగులో బాల‌య్య ప‌క్క‌న అల్ల‌రి పిడుగు సినిమాతో పాటు వెంక‌టేష్‌తో క‌లిసి మ‌ల్లీశ్వ‌రి సినిమా చేసింది.

ఆమె తెలుగులో ఈ రెండు సినిమా చేసే టైంకు ఆమెకు బాలీవుడ్‌లో మ‌రీ అంత స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అయితే లేదు. ఆ త‌ర్వాత క‌త్రినా ఊహించ‌ని విధంగా స్టార్ డ‌మ్ తెచ్చుకుంది. స్టార్ హీరోల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌కు తోడు కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో ఆమె ప్రేమాయ‌ణం ఆమె కెరీర్‌ను ఒక్క‌సారిగా స్వింగ్ చేసేసింది. బ్రిట‌న్‌లో పుట్టిన క‌త్రినా కొంత కాలంగా యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్ల‌లో క‌త్రినా కూడా ఒక‌రు. ఆమె ఒక్కో సినిమాకు … సినిమా రేంజ్‌ను బ‌ట్టి రు. 8 – 11 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ట‌. అలాగే ఒక్కో యాడ్‌కు ఆమె రు . 6 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు.

ఆమె మొత్తం ఆస్తి విలువ రు. 225 కోట్ల‌కు పైనే ఉంటుంద‌ట‌. ఆమెకు విలాస వంత‌మైన భ‌వ‌నాలు, ప్లాట్లు ఉన్నాయి. ఇక క‌త్రినా త్వ‌ర‌లోనే విక్కీ కౌశ‌ల్‌ను పెళ్లి చేసుకునేందుకు ముహూర్తాలు కూడా వెతికే ప‌నిలో బిజీగా ఉంటున్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news