Moviesబాల‌య్యను అనిల్ రావిపూడి ఇంత కొత్తగా చూపిస్తున్నాడా...!

బాల‌య్యను అనిల్ రావిపూడి ఇంత కొత్తగా చూపిస్తున్నాడా…!

టాలీవుడ్ లో వరుస సక్సెస్‌ల‌తో దూసుకు పోతున్నాడు యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ఫ‌స్ట్ సినిమా క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్‌. ఆ సినిమా నుంచి మ‌నోడు వెనుదిరిగి చూసుకోలేదు. ప‌టాస్ – సుప్రీమ్ – రాజా ది గ్రేట్ – ఎఫ్ 2 – స‌రిలేరు నీకెవ్వ‌రు ఐదు సినిమాలు సూప‌ర్ హిట్టే. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2కు సీక్వెల్‌గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ముగిసిన వెంట‌నే అనిల్ యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు.

ఈ సినిమా గురించి అనిల్ ప‌లు ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు వెల్ల‌డించారు. బాల‌య్య గారితో తాను చేసే సినిమాలో కామెడీ డోస్ ఎక్కువుగా ఉంటుంద‌ని.. సినిమా అంతా కంప్లీట్ ఎంట‌ర్టైన్‌మెంట్‌గా కాకుండా సీరియ‌స్ డ్రామా కూడా ఉంటుంద‌ని చెప్పారు. ఓవ‌రాల్‌గా మాత్రం కామెడీకే ఎక్కువ స్కోప్ ఉంటుంద‌న్న అనిల్‌.. బాల‌య్య‌ను కొత్త కామెడీ స్టైల్లో చూపించ‌బోతున్నాన‌ని చెప్పారు. బాల‌య్య‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో చూపించ‌ని విధంగానే క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని కూడా అనిల్ చెప్పారు. ఇక గ‌తంలోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రామారావు గారు పేరుతో ఓ సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ సినిమా క‌థ‌లో మార్పులు చేయాల‌ని సూచించ‌డంతో అది ప‌ట్టాలు ఎక్క‌లేదు.

వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నుంచి వ‌ర్క్ స్టార్ట్ చేస్తామ‌ని.. జూలై నుంచి షూటింగ్ ప్రారంభ మ‌వుతుంద‌ని అనిల్ చెప్పారు. అనిల్ వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో పాటు టాలీవుడ్‌లోనే తిరుగులేని క్రేజీ డైరెక్ట‌ర్‌గా ఉండ‌డంతో బాల‌య్య – అనిల్ కాంబినేష‌న్‌పై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక ప్ర‌స్తుతం బాల‌య్య అఖండ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో పాటు అన్‌స్టాప‌బుల్ షో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అటు అనిల్ ఎఫ్ 3 సినిమా ప‌నుల్లో నిమ‌గ్న‌మై పోయారు. ఈ రెండు ప‌నులు పూర్త‌య్యాక నెక్ట్స్ ఈ ప్రాజెక్టు సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news