Moviesఅసలు ప్రభాస్ ఏ ధైర్యంతో అలా చేస్తాడు..ఛాన్సే లేదు?

అసలు ప్రభాస్ ఏ ధైర్యంతో అలా చేస్తాడు..ఛాన్సే లేదు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు, ఆ క్రేజ్ ను అలానే మెయింటెన్ చేసే ఉద్దేశంతో డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ జిల్ పేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాదే శ్యామ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘రాధేశ్యామ్’ టీజర్.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఓ విషయం తెగ ఆసక్తి కలిగిస్తోంది. అది ఏమిటంటే ఈ కథకు దర్శకుడు ఇప్పటికే సీక్వెల్ పాయింట్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కొన్ని సన్నివేశాలను విన్న ప్రభాస్ రాధాకృష్ణ చెప్పిన సీక్వెల్ పాయింట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం అభిమానులు సముఖంగా లేరు. సినిమా రిలీజ్ అవ్వకుండానే సీక్వెల్ ఎలా ప్లాన్ చేస్తారు. అవన్ని ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మరికొంత మంది అభిమానులు అయితే.. రాధేశ్యామ్ బాక్సాపీస్ వ‌ద్ద ఎలాంటి అంచ‌నాల‌కు చేరుకుంటుందో చూసిన త‌ర్వాత సీక్వెల్‌ తీస్తే బాగుంటుంది అని సజీషన్స్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్‌ వస్తుందో లేదో తెలియాలి అంటే విడుదల వరకు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news