Moviesసింగిల్ షాట్‌లో ఫ్యూష‌న్ డ్యాన్స్..ఇరగదీసిన కార్తికేయ‌..ఖచ్చితంగా చూడాల్సిందే..!!

సింగిల్ షాట్‌లో ఫ్యూష‌న్ డ్యాన్స్..ఇరగదీసిన కార్తికేయ‌..ఖచ్చితంగా చూడాల్సిందే..!!

యంగ్ హీరో కార్తికేయ డైనమిక్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి..మొదటి సినిమాతొనే అదరగొట్టేసారు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు బడా హీరోలుకూడా మెచ్చుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర కాసులు వర్షం కురిపించడమే కాదు..కార్తికేయకు మంచి విజయం సాధించడంతో పాటు.. అందరిని మనసులను గెలుచుకుంది. ఇక ఆ తరువాత తీసిన సినిమాలు అటు ఇటు గా రిజల్ట్ వచ్చినా.. ఆయన పర్ ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇక రీసెంట్ గా కార్తికేయ, తాన్య రవిచంద్రన్‌ జంటగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఋఅజ విక్రమర్క. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ స‌ర్‌ప్రైజ్ ఫ్యూష‌న్ డ్యాన్స్ వీడియోను విడుద‌ల చేశారు చిత్ర మేక‌ర్స్. కార్తికేయ‌, తాన్య‌ల‌పై సింగిల్ షాట్‌లో తీసిన ఫ్యూష‌న్ డ్యాన్స్ ను మల్టీ టాలెంటెడ్ య‌శ్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశాడు.

డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీ పీసీ మౌళి సింగిల్ షాట్‌లో ఈ వీడియోను షూట్ చేసిన్నత్లు తెలుస్తుంది. 45 సెక్ల‌న‌పాటు ఉన్న ఈ క్లాసిక‌ల్ బిట్‌లో కార్తికేయ‌, తాన్య ర‌విచంద్ర‌న్ కెమిస్ట్రీ అదిరిపోయింది అనే చెప్పాలి .
ఇక కార్తికేయ త్వరలో ఓ ఇంటివాడు అవ్వబోతున్న విషయం తెలిసిందే. తన చిన్న నాటి స్నేహితురాలు లోహితను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగింది కూడా. అంతేకాదు మొన్నీమధ్య ‘రాజావిక్రమార్క’ ప్రచార కార్యక్రమంలో తన భార్యను స్టేజీపైకి పిలిచి అందరి ఎదుట ప్రపోజ్‌ చేసి అమ్మాయిని ఆశ్చర్యపరిచాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news