Newsఅద్దెకు అంద‌మైన భార్య‌లు.. మ‌న‌దేశంలోనే ఎక్క‌డో తెలుసా..!

అద్దెకు అంద‌మైన భార్య‌లు.. మ‌న‌దేశంలోనే ఎక్క‌డో తెలుసా..!

మ‌నం సినిమాల్లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సంఘ‌ట‌న‌లు చూస్తూ ఉండేవాళ్లం. అయితే ఇటీవ‌ల గంట‌ల పాటు ప్రేయ‌సిగా న‌టించేందుకు అమ్మాయిల‌ను స‌ర‌ఫ‌రా చేసే గ్యాంగ్‌ల‌ను చూస్తున్నాం.. అయితే ఇప్పుడు అద్దెకు అంద‌మైన భార్య‌లు దొరుకుతున్నారు. ఇది ఎక్క‌డో కాదు.. మ‌న‌దేశంలోనే..! విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజ‌మే..!

క‌ట్టుకున్న భార్య‌ల‌ను అద్దెకిచ్చే వాళ్లు ఎక్క‌డ ఉంటారు ? అన్న సందేహం రావ‌చ్చు.. అయితే ఇది ఎక్క‌డో కాదు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతోంది. వీరు తాము అద్దెకు తెచ్చుకున్న భార్య‌ల‌తో వారు కోరుకున్న‌న్ని రోజులు ఎంచ‌క్కా కాపురం చేయ‌వ‌చ్చు.. గ‌డువు తీరిపోయాక వీరు తిరిగి త‌మ సొంత భ‌ర్త‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతారు. ఈ తంతు అంతా మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో జ‌రుగుతుంది.

ఇక్క‌డ భార్య‌ల‌ను వారం, నెల‌, సంవ‌త్స‌రం పాటు అద్దెకు ఇస్తారు. భార్య ఎంత అందంగా ఉంటే అంత ఎక్కువ రేటు ఇస్తారు. అలాగే ఎంత వ‌య‌స్సు త‌క్కువుగా ఉంటే అంత డిమాండ్ ఉంటుంది. అద్దెకు వ‌చ్చిన భార్య‌లు కూడా కాంటాక్ట్ ప్ర‌కారం అంతే ప్రేమ‌గా ఉంటారు. నిజ‌మైన భ‌ర్త‌తో ఎలా ఉంటారో అలాగే ఉంటారు. వారితో కాపురాలు చేయ‌వ‌చ్చు.. పిల్ల‌ల‌ను కూడా క‌న‌వ‌చ్చు.

ఇందుకు రేటు రు. 2 వేలుతో మొద‌లై ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఈ తంతు అంతా బాండ్ పేప‌ర్ సాక్షిగానే ఉంటుంది. ద‌స్తావేజుల‌పై రాత‌లు అయ్యాక భార్య‌ల‌ను ఇస్తారు. ఇక ఇక్క‌డ పెళ్లియ‌న అమ్మాయిల్నే కాదు పెళ్లికాని అమ్మాయిల‌ను కూడా అద్దెకు ఇస్తుంటారు. ఇందుకు వాళ్లు ధ‌డిచా అనే పేరు పెట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news