Moviesఏఆర్‌. రెహ్మ‌న్ మేన‌ల్లుడు మ‌న‌కు తెలిసిన స్టార్ హీరోయే.... ఎవ‌రో తెలుసా..!

ఏఆర్‌. రెహ్మ‌న్ మేన‌ల్లుడు మ‌న‌కు తెలిసిన స్టార్ హీరోయే…. ఎవ‌రో తెలుసా..!

ఏఆర్‌. రెహ్మ‌న్ భార‌తీయ సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఆయ‌న కూడా ఒక‌రు. రెహ్మ‌న్ స్వ‌రాలు శ్రోత‌ల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేయ‌డంతో పాటు వారిని మ‌రో లోకంలోకి తీసుకు వెళ్లేలా మైమ‌రిపింప చేస్తాయి. ఏకంగా ఆస్కార్ అవార్డుతో రెహ్మ‌న్ ప్ర‌పంచ చ‌రిత్ర పుట‌ల్లోకి ఎక్కిన వేళ యావ‌త్ భార‌తావ‌ని ఎంతో పుల‌కించి పోయింది. ఆయ‌న మేన‌ల్లుడు కూడా మామ బాట‌లోనే ముందుకు వెళుతూ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానే కాకుండా.. ఏకంగా హీరోగా కూడా రాణిస్తున్నాడు.

ఇంత‌కు ఆ హీరో ఎవ‌రో కాదు జీవీ ప్ర‌కాష్ కుమార్‌. ప్ర‌కాష్ రెహ్మ‌న్‌కు స్వ‌యానాఆ మేన‌ల్లుడు. రెహ్మ‌న్ సోద‌రుడి కుమారుడే ప్ర‌కాష్‌. రెహ్మ‌న్ త‌ల్లి చిన్న‌ప్పుడే ప్ర‌కాష్‌ను రెహ్మ‌న్ ద‌గ్గ‌ర పెట్టి మ్యూజిక్‌తో పాటు పాట‌లు పాడ‌డం నేర్పించ‌మ‌ని చెప్పింద‌ట‌. చిన్న‌ప్ప‌టి నుంచే మేన‌మామ ద‌గ్గ‌ర మ్యూజిక్ పాటాలు నేర్చుకున్న ప్ర‌కాష్ అక్క‌డ ఆరితేరిపోయాడు. జెంటిల్‌మ‌న్ సినిమాలో చికుబుకు రైలే పాట పాడి కేవ‌లం 5 ఏళ్ల‌కే పెద్ద సెల‌బ్రిటీ అయిపోయాడు.

ఆ త‌ర్వాత బొంబాయి సినిమ‌లో కుచ్చి కుచ్చి కూన‌మ్మా సాంగ్ కూడా పాడాడు. అయితే ప్ర‌కాష్ త‌ల్లిదండ్రులు విడిపోవ‌డం మ‌నోడి కెరీర్‌లో పెద్ద ఎదురు దెబ్బ‌. జీవీ తండ్రితో ఉండిపోయాడు. ఆ త‌ర్వాత ప‌ట్టుద‌ల‌తో మేన‌మామ బాట‌లోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణించాడు. ఆ త‌ర్వాత హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి ప‌లు స‌క్సెస్‌లు సాధించాడు. త‌మిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌, ఎందుకంటే ప్రేమంటే లాంటి సినిమాల‌కు మ్యూజిక్ ఇచ్చారు.

త‌ర్వాత హీరోగా మారి త్రిష లేదా న‌య‌న‌తార‌, పెన్సిల్ లాంటి వైవిధ్య‌మైన సినిమాల్లో కూడా న‌టించాడు. త‌మిళ్లో మాత్ర‌మే కాకుండా ఇప్పుడు తెలుగులో కూడా త‌న‌కంటూ ఓ అభిమాన గ‌నాన్ని జీవి ప్ర‌కాష్ క్రియేట్ చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news