Newsఆంధ్రా ఎమ్మెల్యేలు హైద‌రాబాద్‌లో విలాసాలు... వామ్మో ఇంత‌ చ‌రిత్రే...!

ఆంధ్రా ఎమ్మెల్యేలు హైద‌రాబాద్‌లో విలాసాలు… వామ్మో ఇంత‌ చ‌రిత్రే…!

హైద‌రాబాద్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ‌డా బాబుల విలాసాల‌కు అడ్డాగా మారింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యేలు ఇక్క‌డ వీకెండ్‌లో ఎంజాయ్ చేయ‌డం మామూలే. అయితే ఇప్పుడు ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యేలు వీకెండ్ వ‌చ్చిందంటే చాలు హైద‌రాబాద్‌లో వాలిపోతున్నార‌ట‌. వీరికి డ‌బ్బు సంపాద‌న‌కు, రాజ‌కీయం చేయ‌డానికి మాత్ర‌మే ఆంధ్రా కావాల‌ట‌… వీరు విలాసంగా ఖ‌ర్చు చేయాల‌న్నా.. ఎంజాయ్ చేయాల‌న్నా.. ఆటాడుకోవాల‌న్నా కూడా హైద‌రాబాద్ మాత్ర‌మే సేఫ్ అంటున్నారు.

ఒక్క ఎమ్మెల్యేలు మాత్ర‌మే కాదు.. ఆంధ్రాకు చెందిన పెద్ద పెద్ద వ్యాపారుల పిల్ల‌లు ఆంధ్రాలో ఉన్నా.. వీరు హైద‌రాబాద్‌లో ప్లాట్లు అద్దెకు తీసుకుంటున్నారు. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు ఇక్క‌డ వాలిపోతున్నారు. ప‌బ్‌లు, రెస్టారెంట్లు, జూదాలు, ఇత‌ర విలాసాల‌తో ఇక్క‌డ పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్‌, టీ 20 క్రికెట్ టోర్న‌మెంట్లు న‌డుస్తున్నాయి. ఈ బెట్టింగ్‌ల‌కు కూడా హైద‌రాబాద్‌నే అడ్డాగా ఎంచుకుంటున్నారు.

ఒక్క రాత్రిలోనే ఇక్క‌డ కోట్లు ఖ‌ర్చు పెట్టేయ‌వ‌చ్చు.. అలాగే రాత్రిలోనే కోట్లు సంపాదించ‌నూ వ‌చ్చు. ఇక్క‌డ ఎక్కువ అక్క‌ర్లేదు ఐదారు టేబుల్లు ర‌న్ చేస్తే చాలు.. అన్ని ఖ‌ర్చులు పోనూ రోజుకు ఇంకా చెప్పాలంటే ఒక్క నైట్‌కే రు. 2 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు. ఇక్క‌డ జూదం ఆడేది, ఎంజాయ్ చేసేది సెల‌బ్రిటీలు వాళ్లు ఇచ్చే డ‌బ్బు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు త‌మ విలాసాలు, స‌ర‌దాలు తీర్చుకునేందుకు హైద‌రాబాద్‌లోనే ఎక్కువుగా ఉంటున్నార‌ట‌. పైగా ఆంధ్రాలో చాలా మందికి చేయ‌డానికి ప‌నులు కూడా లేవు. దీంతో కొంద‌రు ఎమ్మెల్యేలు హైద‌రాబాద్లోనే ర‌క‌ర‌కాల వ్యాపారాలు చేసుకుంటూ అక్క‌డే ఎంజాయ్ చేస్తోన్న ప‌రిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news