Moviesవారెవ్వా ..మళ్లీ ఇన్నాళ్లకు ..ఫ్యాన్స్ కు స్పెషల్ సర్‏ప్రైజ్ ఇచ్చిన...

వారెవ్వా ..మళ్లీ ఇన్నాళ్లకు ..ఫ్యాన్స్ కు స్పెషల్ సర్‏ప్రైజ్ ఇచ్చిన నాని..!!

నేచురల్‌ స్టార్‌ నాని ప్ర‌స్తుతం టాక్సీవాలా ఫేమ్ రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మింస్తుతున్నారు. ఈ చిత్రంలో నానికి జోడీగా సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్రస్తుతంషూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం అతి త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా క‌థకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఒక కాలంకు చెందిన వ్యక్తి మృతి చెంది మళ్లీ పుట్టడమే ఈ చిత్ర కథ అని తెలుస్తోంది.

గత జన్మ గుర్తుకు రావడం లేదా గత జన్మకు సంబంధించిన ఏదైనా కార్యం పూర్తి చేయడం పైనే ఈ సినిమా సాగుతుంద‌ని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నాని డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అందులో కోల్ కత్తా కు చెందిన వ్యక్తి పాత్ర ఒక‌టి కాగా.. మ‌రొక‌టి తెలుగు వ్య‌క్తి పాత్ర అని స‌మాచారం. ఒక‌వేళ ఇది నిజ‌మైతే సినిమా ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం ఖాయమ‌ని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా, కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో నేచుర‌ల్ స్టార్ నాని స‌క్సెస్ రేటు త‌గ్గిందనే చెప్పాలి. క‌రోనా కారణంగా నాని న‌టించిన కొన్ని చిత్రాలు ఓటీటీలో విడుద‌లై ..నెగెటివ్ టాక్ సంపాదించుకుంటున్నాయి. అయితే నాని న‌టించిన వ‌రుస సినిమాలు ఓటీటీలో విడుద అవుతున్న నేప‌థ్యంలో తన తదుపరి సినిమా శ్యామ్ సింగ‌రాయ్ చిత్ర విడుద‌లపై సందేహాలు నెల‌కొని ఉన్నాయి. తాజాగా న్యాచురల్ స్టార్ నాని.. అభిమానులకు స్పెషల్ సర్‏ప్రైజ్ ఇచ్చారు.. శ్యామ్ సింగరాయ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నాట్లుగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా నాని ప్రకటించాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news