Moviesశ్రీకాంత్ భార్య గురించి ఈ త‌రానికి తెలియ‌ని టాప్ సీక్రెట్స్‌

శ్రీకాంత్ భార్య గురించి ఈ త‌రానికి తెలియ‌ని టాప్ సీక్రెట్స్‌

సినిమా ఇండ‌స్ట్రీలో న‌టించిన వారు ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం కామ‌న్‌. ఇది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతూనే ఉంది. అయితే చాలా మంది ప్రేమ‌లు, పెళ్లిళ్లు మూడునాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలి పోతుంటాయి. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే దాంప‌త్య జీవితాన్ని తాము ఉన్నంత వ‌ర‌కు కొన‌సాగిస్తారు. ఆద‌ర్శ దంప‌తులుగా ఉంటారు. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ – ఊహ దంపతులు కూడా ఈ కోవ‌లోకే వ‌స్తారు.

శ్రీకాంత్ – ఊహా జంట‌గా తొలిసారిగా ఆమె సినిమాలో న‌టించారు. ఈ సినిమా ఈ జంట‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చింది. త‌ర్వాత వీరు మ‌రో నాలుగు సినిమాల‌లో జోడీ క‌ట్టారు. ఆ సినిమాల షూటింగ్ స‌మ‌యంలో ఏర్ప‌డిన చ‌నువు కాస్తా ప్రేమ‌గా మారింది. అప్పుడు శ్రీకాంత్ వ‌రుస హిట్ల‌తో కెరీర్‌లో మంచి న‌టుడిగా ఉన్నాడు.

చివ‌ర‌కు నాలుగేళ్ల ప్రేమ త‌ర్వాత వీరు ఈ విష‌యాన్ని ముందుగా ఊహ కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారు. ఊహ త‌ల్లిదండ్రుల‌కు శ్రీకాంత్‌పై మంచి అభిప్రాయం ఉండ‌డంతో వారు వెంట‌నే పెళ్లికి ఓకే చెప్పేశారు. శ్రీకాంత్ త‌ల్లిదండ్రులు ఊహ‌ను కొడ‌లిగా తెచ్చుకునేందుకు కొంత త‌ట‌ప‌టాయించినా చివ‌ర‌కు ఓకే అన్నారు. శ్రీకాంత్‌కు అన్న‌గా ఎప్పుడూ అండ‌గా ఉండే మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగ‌డంతో ఈ పెళ్లి సాఫీగా జ‌రిగింద‌ని శ్రీకాంత్ ప‌లు సార్లు చెప్పాడు.

శ్రీకాంత్ – ఊహా దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ నాగార్జున నిర్మించిన నిర్మ‌లా కాన్వెంట్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news