Movies"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్"లో పూజా హెగ్డే పాత్ర పేరు వెనకున్న సీక్రెట్...

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”లో పూజా హెగ్డే పాత్ర పేరు వెనకున్న సీక్రెట్ ఇదే..!!

టాలీవుడ్ మొస్ట్ హ్యాండ్ సం హీరో నాగారజున కోడుకుగా సీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌..టాలీవుడ్ బుట్టబోమ్మ పూజా హెగ్డే కలిసి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. అటు విజయాలు లేక సతమతమవుతోన్న అఖిల్‌కు, ఇటు దర్శకుడు భాస్కర్‌కు ఎంతో కీలకమైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భాస్కర్‌ కూడా ఈ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమాను తెరకెక్కించినట్లు చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, టీజర్‌లు ఏ స్దాయిలో ప్రేక్ష్స్క్స్ ఆదరణ్ పొందాయో మనం చూసాం.

 

అల్లు అరవింద్‌, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్దమైంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో నిన్న్ హైదరబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవేంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. పలువురు ప్రముఖుల మధ్య ..వాళ్ళ ఆశిసులతో అఖిల్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతాడు అని పక్కగా ఉన్నాడు.

 

అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర‌కు సంబంధించి డైరెక్ట‌ర్ భాస్క‌ర్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని రివీల్ చేసారు. బొమ్మ‌రిల్లులో హీరోయిన్‌ కు హాసిని అని త‌న మొద‌టి అమ్మాయి పేరు పెట్టుకున్న ఈ డైరెక్ట‌ర్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మూవీలో పూజా హెగ్డే పాత్రకు త‌న రెండో అమ్మాయి విభా పేరుని పెట్టుకున్నారట. ఈ సినిమా స‌క్సెస్‌పై భాస్క‌ర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.ఈ సినిమాలో అఖిల్‌ను కొత్త కోణంలో చూస్తారని చెప్పిన ఆయన.. చిన్న కోపం నుంచి ఈ క‌థ త‌యారైందని చెప్పుకొచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్‌కు ఉండే ప్రాబ్ల‌మ్‌ను ఈ సినిమాతో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాం. ఖచ్చితంగా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని “అని అన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news