Moviesఆ హీరోయిన్ ముద్దు ఇస్తుందని మూతి కడుక్కొని వచ్చిన హీరో..!!

ఆ హీరోయిన్ ముద్దు ఇస్తుందని మూతి కడుక్కొని వచ్చిన హీరో..!!

అతిలోక సుందరి శ్రీదేవి.. ఈ పేరు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమె అందంతో..నటనతో ఎంతోమంది ప్రేక్ష్కులను సొంతం చేసుకుంది. శ్రీదేవి తెలుగులో ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ అందాల తార మన తెలుగులో దాదాపు స్టార్ హీరోస్ అందరితోను జతకట్టింది. ముఖ్యంగా చిరంజీవి-శ్రీదేవి జంట అదుర్స్ అనే చెప్పాలి. ఈ కాంబినేషం లో వచ్చిన అని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

ఇక ఈ విషయాలు పక్కన పెడితే..శ్రీదేవి ముద్దు ఇస్తుందని ఓ హీరో ఆమె దగ్గరకు నోరు కడుకుని మరీ వెళ్ళాడట. కానీ  కిస్ కాదు కదా.. కనీసం హగ్..చివరికి అతనితో మాట్లాడకుండానే వెళ్లిపోయిందట. ఇంతకి ఆ హీరో ఎవరో తెలుసా..?? తెలిస్తే షాక్ అయిపోతారు. జేడీ చక్రవర్తి . అప్పట్లో తన నటనతో తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది ప్రేక్షక ఆదరాభిమానులు పొందిన నటుడు. మొదటి సినిమాతోనే యాక్టింగ్‌లో మంచి మార్కులు కొట్టేసిన జేడీ ఆ తరువాత సౌత్ సినిమాల్లో కొంతకాలం బిజీ ఆర్టిస్ట్‌గా వెలిగిపోయాడు.

ఈయనకు శ్రీదేవి అన్న..ఆమె యాక్టింగ్ అన్న చ్చ్హేంత ఇష్టమట. అయితే శ్రీ దేవి లాంటి అందాల భామ తో ఒక్క సినిమా చేసిన చాలు అని ఎంతో మంది హీరోలు, దర్శకులు కూడా ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్లలో ఒకరు జేడీ చక్రవర్తి ఉంటారు. శ్రీదేవి అంటే రామ్ గోపాల్ వర్మకు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. వర్మకు తెలియకుండా జేడీ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడట. ఆర్టిస్టుగా మంచి పేరుసంపాదించిన జేడీ క్షణక్షణం సినిమాలో శ్రీదేవితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేశాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యుల్లో జేడీ చక్రవర్తి కి కొన్ని ఆసకికర ఇన్సిడెంట్ ఒకటి చెప్పుకొచ్చారు.

అది ఏమిటంటే..జేడీ నటించిన మనీ మూవీ చూసి శ్రీదేవి ..నేనిప్పటి వరకు చూసిన మంచి నటుల్లో చక్రవర్తి కూడా ఒకరు అని అన్నారట. ఆ ఆనందంలోనే క్షణక్షణం సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి దగ్గరికి వెళ్లి పలకరించాడట. కానీ అప్పటికే షాట్ రెడీ అవడంతో జేడీ పలకరింపునకు సమాధానం ఇవ్వకుండానే షూట్ కి వెళ్లిపోయిందట శ్రీదేవి. ఆ విషయం చెపుతూ..మంచి నటుడిని అని కాంప్లిమెంట్ ఇచ్చింనందుకు ముద్దు పెడుతుందేమో అని నోరు కూడా కడుక్కుని వెళ్లా అని..కానీ ముద్దు కాదు కనీసం హగ్ కూడా లేదు అని చెప్పుకొచ్చాడు జేదీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news