Moviesషాకింగ్‌: డ్ర‌గ్స్ ఇష్యూలో ఆ క్రేజీ హీరోయిన్లు కూడా... సంచ‌ల‌న నిజాలు

షాకింగ్‌: డ్ర‌గ్స్ ఇష్యూలో ఆ క్రేజీ హీరోయిన్లు కూడా… సంచ‌ల‌న నిజాలు

భార‌త సినిమా రంగాన్ని గ‌త రెండేళ్లుగా డ్ర‌గ్స్ ఉదంతాలు వెంటాడుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్‌, బాలీవుడ్‌, శాండ‌ల్ వుడ్‌, బాలీవుడ్ అన్న తేడా లేకుండా ఎక్క‌డ చూసినా సినిమా వాళ్లు డ్ర‌గ్స్ ఇష్యూలో చిక్కుకుని వార్త‌ల్లోకి ఎక్కుతున్నారు. టాలీవుడ్ ను గ‌త రెండేళ్లుగా కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ కేసు ఇంకా స‌మాప్తం కాలేదు. ఇటీవ‌ల కూడా ఈడీ సినిమా వాళ్ల‌ను పిలిచి విచారించింది.

ఇక అటు శాండ‌ల్ వుడ్‌లోనూ డ్ర‌గ్స్ ఉదంతంలో చిక్కుకునే సంజ‌న‌, రాగిణి ద్వివేది జైలు ఊచ‌లు కూడా లెక్క పెట్టారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ సైతం రేవ్ పార్టీలో దొరికి పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆర్య‌న్ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన లండ‌న్ సెవెన్ వోక్స్ తో పాటు యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో కూడా ఉన్న‌త విద్య అభ్య‌సించాడు.

మ‌నోడు ముంబై తీరంలో స‌ముద్రం మ‌ధ్య‌లో ఓ క్రూయిజ్ షిఫ్‌లో జ‌రుగుతోన్న రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ మ‌త్తులో మునిగి తేలుతూ పోలీసుల‌కు అడ్డంగా దొరికి పోయాడు. పోలీసులు ఆర్య‌న్‌ను ప్ర‌స్తుతం విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్య‌న్ ఫోన్ తీసుకున్న పోలీసులు డేటా ప‌రిశీలిస్తే అందులో మ‌రి కొంద‌రు యంగ్ హీరోయిన్స్‌కు కూడా డ్ర‌గ్స్ ఉదంతంతో లింక్ ఉంద‌ని తేలింద‌ట‌.

పోలీసులు ఆ యంగ్ హీరోయిన్స్‌ను కూడా విచార‌ణ‌కు పిలుస్తార‌ని.. మ‌రిన్ని సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news