Moviesతెలిసి తెలిసి అదే తప్పు చేస్తున్న శ‌ర్వానంద్..భారీ మూల్యం తప్పదా..?

తెలిసి తెలిసి అదే తప్పు చేస్తున్న శ‌ర్వానంద్..భారీ మూల్యం తప్పదా..?

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో నటన పరంగా స్టార్ హీరోల కి ఏమాత్రం తీసి పోని నటన తో మెప్పించే యాక్టర్ శర్వానంద్. శర్వానంద్ విలక్షణ కథానాయకుడు. స్టార్ అనడం కన్నా అద్భుతమైన నటుడు, సూపర్ పెర్ఫార్మెర్ అని అంటే సరిగ్గా అతనికి సెట్ అవుతుంది. ఎందుకంటే శర్వానంద్ కెరియర్ ను గమనిస్తే అందులో కథాబలం, లేదా నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలే ఎక్కువగా ఉంటాయి.

అయితే తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమా మహాసముద్రం. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా చూసిన తరువాత అందరు ఒకటే మాట అంటున్నారు. ఎందుకు శ‌ర్వానంద్ తనకు సెట్ కానీ జోన్ కు వెళ్లి మరీ..అదే సినిమాలు చేస్తున్నాడు అంటూ చర్చించుకుంటున్నారు. శ‌ర్వానంద్ కొన్నిసార్లు క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్ప‌ట‌డుగు వేస్తాడ‌న్న టాక్ కూడా ఉంది. ఈ సినిమాతో చూసిన తరువాత ఇదే విష‌యాన్ని గుర్తు చేసుకుంటున్నారు కొంద‌రు నెటిజన్లు.

ఇప్పటి వరకు మనం చూసిన్నట్లైతే శ‌ర్వానంద్ ట్రాక్ రికార్డు ..కామెడీ, ఎంట‌ర్ టైన్ మెంట్ యాంగిల్ లో వ‌చ్చే సినిమాలు అత‌నికి స‌రిగ్గా సెట్ అవుతాయి. బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ పరంగా కూడా బాగా రాబడతాయి. అయితే సీరియ‌స్ క‌థాంశాలు శ‌ర్వానంద్ కి సెట్ అవ్వవు..కలిసి రావు. కానీ శర్వా మాత్రం ఇలాంటి తప్పు నే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. అయితే శ‌ర్వానంద్ స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల భవిష్యత్తుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news