Moviesఅక్కినేని గుట్టు ర‌ట్టు చేయ‌నున్న స‌మంత‌.. ప్రెస్‌మీట్‌కు రెడీ...?

అక్కినేని గుట్టు ర‌ట్టు చేయ‌నున్న స‌మంత‌.. ప్రెస్‌మీట్‌కు రెడీ…?

ఏమామ చేశావే సినిమాలో జెస్సీ పాత్ర‌తో ఒక్క‌సారిగా సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని త‌న వైపున‌కు తిప్పుకుంది స‌మంత‌. ఏడెనిమిది సంవ‌త్స‌రాలు అయితే కోలీవుడ్ లేదు… టాలీవుడ్ లేదు.. మొత్తం సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. కోలీవుడ్ విజ‌య్‌, సూర్య‌, విశాల్ నుంచి ఇటు టాలీవుడ్‌లో ప‌వ‌న్‌, మ‌హేష, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ ఇలా అంద‌రు స్టార్ హీరోల‌తోనూ న‌టించి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసింది.

ఇక అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకున్న స‌మంత నాలుగేళ్ల కాపురం త‌ర్వాత అంద‌రికి స‌డెన్ షాక్ ఇస్తూ అత‌డికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. విడాకుల‌పై చైతు, స‌మంత అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేసేశారు. విడాకుల త‌ర్వాత స‌మంతను టార్గెట్ చేస్తూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ విడాకుల‌కు కార‌ణం స‌మంతే అని.. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌తో పాటు ఆమె సినిమాల్లో అసభ్యంగా న‌టించ‌డంతోనే అస‌లు గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అక్క‌డితో ఆగ‌కుండా ఆమెకు పిల్ల‌ల‌ను క‌న‌డం ఇష్టంలేద‌ని.. అక్కినేని ఫ్యామిలీకి చెప్ప‌కుండా అబార్ష‌న్ చేయించుకుంద‌ని.. కేవ‌లం ఆమె స్నేహితులు ఆమెను రాంగ్ ట్రాక్ ప‌ట్టించార‌ని.. ఆ మాట‌లు వినే ఆమె చైతుకు విడాకులు ఇచ్చేసిందంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు ఆమె టార్గెట్‌గా వ‌స్తున్నాయి. ఇక చైతు త‌న ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ను పెళ్లాడేందుకు రెడీగా ఉంద‌ని.. అందుకే చైతుకు దూర‌మైంద‌ని కూడా అంటున్నారు.

ఇలా త‌న‌ను టార్గెట్‌గా చేసుకుని ఎవ‌రికి వారు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా క‌థ‌నాలు వేస్తుండ‌డంతో ఆమె విసిగిపోయిన‌ట్టు తెలుస్తోంది. అస‌లు నిజాలు ఎవ్వ‌రికి తెలియ‌వు అని… కేవ‌లం త‌న‌నే టార్గెట్‌గా చేసుకుని ఈ క‌థ‌నాలు ఎందుకు వేస్తున్నారో ? తెలియ‌డం లేద‌ని ఆమె స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యం మ‌రీ శృతి మించితే తానే స్వ‌యంగా ప్రెస్‌మీట్ పెట్టి అస‌లు తాను ప‌డిన క‌ష్టాలు, బాధ‌ల‌తో పాటు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్న విష‌యంపై అంద‌రికి ఓపెన్‌గానే చెపుతాన‌ని కాస్త సీరియ‌స్‌గానే చెప్పింద‌ని అంటున్నారు.

త‌న చుట్టూ ఈ దుష్ప్ర‌చారం ఆగ‌క‌పోతే అక్కినేని ఫ్యామిలీ గుట్టు ర‌ట్టు చేసేందుకు కూడా స‌మంత వెనుకాడ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌మంత దూకుడు చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీ టార్చ‌ర్‌, ఆమె ప‌డిన ఇబ్బందులు ఇలా ఎన్నో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news