Moviesనిజంగా చెప్పుతున్న..నా వల్ల కావడం లేదు..త‌ట్టుకోలేక‌పోతున్నా...!!

నిజంగా చెప్పుతున్న..నా వల్ల కావడం లేదు..త‌ట్టుకోలేక‌పోతున్నా…!!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిన్న తన ఇంట్లో వర్క్ అవుత్స్ చేస్తూ.. జిం లో గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఫ్యామిలీ హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లిన ఫలితం లేకుండాపోయింది. చికిత్స్ తీసుకుంటూనే ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇకా ఆయన మారణ వార్త కేవ‌లం శాండ‌ల్ వుడ్‌ను మాత్ర‌మే కాకుండా భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ‌ను సైతం తీవ్ర విషాదంలో నింపేసింది.

చిన్న వ‌య‌స్సులోనే స్టార్ హీరోగా ఉన్న పునీత్ మృతి అంద‌రికి షాక్ ఇచ్చింది. పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగారు పునీత్ రాజ్ కుమార్. చేసింది 29 సినిమాలే అయినా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీలోకాన్ని విషాదంలో మించేసింది. పునీత్ కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీతో ఎంతో సంబంధం ఉంది.

ఇక్క‌డ స్టార్ హీరోలు అంద‌రితోనూ ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది. పునీత్ తండ్రి క‌న్న‌డంలో లెజెండ్రీ యాక్ట‌ర్ రాజ్ కుమార్ కావ‌డంతో ఆ త‌రం నుంచే ఇక్క‌డ సినిమా కుటుంబాలు అయిన నంద‌మూరి, అక్కినేని, కొణిదెల‌, ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీల‌కు చెందిన హీరోల‌తో అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు. అప్పు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పునీత్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం తో సినీలోకం విషాదంలో మునిగిపోయింది.

పునీత్ మరణ వార్త విని కన్నడ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులంతా పునీత్ మరణ వార్త విని షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఇక లేడ‌న్న వార్త తెలియ‌డంతో తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తూ పూరీ జగన్నాథ్.. ట్విట‌ర్ లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశాడు.‘నేనిప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నా. పునీత్ నాకు చాలా క్లోజ్‌. పునీత్ ఎంతోమందిని ఆదుకున్నాడు. సాయం చేశాడు. అలాంటి మ‌నిషి దూర‌మ‌వ‌డం నేను నిజంగా జీర్ణించుకోలేక‌పోతున్నాను. పునీత్ ఈ లోకాని విడిచి వెల్లిపోయాడు అంటే త‌ట్టుకోలేక‌పోతున్నా.. అంటూ ఎమోషన్ల్ అయ్యారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news