Movies‘రాధే శ్యామ్’ టీజర్ వచ్చేసిందోచ్..విక్రమాదిత్య గా ప్రభాస్ అదుర్స్..!!

‘రాధే శ్యామ్’ టీజర్ వచ్చేసిందోచ్..విక్రమాదిత్య గా ప్రభాస్ అదుర్స్..!!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధే శ్యామ్ సినిమా కోసం ఇండియా సినిమా ల‌వ‌ర్స్ ఎంత ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారో చెప్ప‌క్క‌ర్లేదు. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఫ్యూజులు ఎగిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న రాను రోజు వచ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.

కాగా తాజాగా విడుదలైన టీజర్లో ప్రభాస్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ సినిమాలో ‘విక్రమాదిత్య’ అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. పూజాహెగ్దే హీరోయిన్ గా సందడి చేయనుంది. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు.యూర‌ప్ నేప‌థ్యంలో కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం జ‌రిగిన క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమా రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఈ ప్రేమ‌క‌థ‌లో పూజా ప్రేర‌ణ అనే అమ్మాయిగా క‌నిపించ‌నుంది.

ఇక పీరియాడిక‌ల్ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్నందున క‌ల‌ర్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంది. ఏదేమైనా లుక్‌తోనే మ‌నం ఆ కాలంలోకి వెళ్లిపోయాలా చేసాడు డైరెక్టర్. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.‘సాహూ’ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే కావడంతో ప్రభాస్ ఫాన్స్ తో పాటుగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘సాలార్’ వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. కెజిఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ ‘ఆదిపురుష్’, ప్రాజెక్ట్ క్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news