Moviesపునీత్ రాజ్‌కుమార్ ప్రేమ పెళ్లి... భార్య ఎవ‌రో తెలుసా..!

పునీత్ రాజ్‌కుమార్ ప్రేమ పెళ్లి… భార్య ఎవ‌రో తెలుసా..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తీవ్ర గుండె పోటుతో మృతి చెందారు. శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ ఉండ‌గా త‌న‌కు చాతిలో నొప్పిగా ఉంద‌ని చెప్పారు. ఆ టైంలో ఆయ‌న్ను బెంగ‌ళూరులో విక్ర‌మ్ హాస్ప‌ట‌ల్లో చేర్పించ‌గా.. ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు. చివ‌ర‌కు ఐసీయూలు చికిత్స అందిస్తుండ‌గా ఆయ‌న మృతి చెందిన‌ట్టు నిర్దారించారు.

పునీత్ వ‌య‌స్సు కేవ‌లం 46 సంవ‌త్స‌రాలే. చిన్న వ‌య‌స్సులో ఎంతో కెరీర్ ఉండ‌గానే ఆయ‌న మృతి చెంద‌డం కేవ‌లం ఆయ‌న అభిమానులు మాత్ర‌మే కాకుండా.. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారంతా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక పునీత్ త‌న తండ్రి దివంగ‌త లెజెండ్రీ న‌టుడు, క‌న్న‌డ కంఠ‌రీవ రాజ్‌కుమార్ సినీ వార‌స‌త్వాన్ని నిల‌బెడ‌తార‌ని భారీ అంచ‌నాలు ఉండేవి.

ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే 1999వ సంవత్సరంలో డిసెంబర్ ఒకటో తేదీన‌ అశ్వనీ రేవంత్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ చాలా చిత్రంగా జ‌రిగింది. పునీత్‌కు అశ్వనీ ఫ్రెండ్స్ ద్వారా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత వారు ప్రేమించుకుని.. పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news