Moviesస్పిరిట్ కోసం ప్ర‌భాస్ క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్.. అసలు ఊహించలేరు తెలుసా...?

స్పిరిట్ కోసం ప్ర‌భాస్ క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్.. అసలు ఊహించలేరు తెలుసా…?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉండ‌గా, స‌లార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. నాగ్ అశ్విన్ చిత్రం న‌వంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్న ప్రభస్స్..ఈ మధ్యనే బ్లాక్ బస్టర్ సినిమా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో ఓ క్రేజీ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన వివరాలతో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేసింది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న స్పిరిట్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. స్పిరిట్ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల అనౌన్స్‌మెంట్ రాగా, 2023లో ఈ సినిమా విడుదల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానుల‌ని షాక్ కి గురి చేస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి గాను ప్రభాస్ ఏకంగా 180 కోట్ల రెమ్యూనరేష్ డిమాండ్ చేస్తున్నారట. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్య మేకర్స్ సైతం అంత్ భారీ మొత్తాని చెల్లించడానికి సిద్ధమైయ్యరట. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ ప్ర‌భాస్ ని ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చూపించ‌నున్న‌ట్టు బాలివుడ్‌ లో ప్ర‌చారం జ‌రుగుతుంది. మరి నిజానిజాలు తెలియాలంటే పూర్తి వివరాలు వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే..!!

Latest news