టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. భరత్ అనేనేను – మహర్షి – సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస హిట్లతో మహేష్ దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహేష్ పక్కన తొలిసారిగా కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ సైతం ఇప్పటికే 38 మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకు పాత్రలో మహేష్ కనిపిస్తాడట. ఈ సినిమా కోసం మహేష్‌కు అక్షరాలా రు. 50 కోట్ల రెమ్యునరేషన్ ముట్టబోతోందని తెలుస్తోంది.
ఇటీవల మహేష్ సినిమాలు రు. 160 నుంచి రు. 170 కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. దీనికి తోడు వరుస హిట్లతో మనోడి మార్కెట్ పెరగడంతో మహేష్‌కు మైత్రీ వాళ్లు గట్టిగానే ఇస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు.