Movies“ఉప్పెన” సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ షర్ట్స్ వెనక ఇంత స్టోరీ...

“ఉప్పెన” సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ షర్ట్స్ వెనక ఇంత స్టోరీ ఉందా..తెలుసుకుని తీరాల్సిందే..!!

మెగా కాంపౌండ్‌ నుండి వచ్చిన అరడజన్ హీరోలలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు మంచి గుర్తింపును సాధించుకున్నారు. ఇక వారి అడుగుజాడల్లో వచ్చి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. మెగా మేనల్లుడు వైష్ణవి తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఉప్పెన. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన‌ బాక్సాఫీస్ దగ్గర వ‌సూళ్ల‌ వర్షం కురిపించింది.

కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీ రోల్ పోషించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12 న రిలీజ్ అయ్యి రు. 50 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టింది. ఓ డెబ్యూ హీరో మూవీ ఈ రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ అంటే పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఈ సినిమాతోనే వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి – బుచ్చిబాబు కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా తో కృతి శెట్టి-వైష్ణవ్ తేజ్ సుడి తిరిగిపోయిందనే చెప్పాలి. వరుస ఆఫర్లు అందుకుంటూ ఓ రేంజ్ సినిమాలు చ్ఝేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. మనకు తెలిసిందే ఈ సినిమాను మనకు చూయించేటప్పుడు 2000 సంవత్సరం మొదట్లో జరిగిన కథగా చూపిస్తారు. అంతేకాదు ఇందులో నటీనటుల డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరో దుస్తులు అయితే చాలా సాధారణంగా ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరో దుస్తుల కోసం డిజైనర్ ప్రసన్న దంతులూరి చీర తీసుకొచ్చి కట్ చేసి దాన్ని షర్ట్ గా కుట్టారట. అందుకే ఈ సినిమాలో హీరో వేసుకున్న షర్ట్స్ అన్నీ పూలుతోనే ఉంటాయి. చూడటానికి చాలా సులభంగా కనిపించిన ఈ షర్ట్స్ డిజైన్ చేయడంలో డిజైనర్ చాలా కష్టపడ్డారట.

ఇక తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో వైష్ణవ్‌ క్రేజ్‌ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం వైష్ణవ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ‘కొండపొలం’ అనే ప్రయోగాత్మక చిత్రం తో పాటు మరో సినిమాని కూడా లైన్‌లో వెట్టాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమాను సైన్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news