Moviesహ‌రితేజ ఇళ్లు ఇంద్ర‌భ‌వ‌న‌మే.. కోట్ల‌లో ఆస్తి..! ( వీడియో )

హ‌రితేజ ఇళ్లు ఇంద్ర‌భ‌వ‌న‌మే.. కోట్ల‌లో ఆస్తి..! ( వీడియో )

యాంక‌ర్ హ‌రితేజ త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ పాపుల‌ర్ అయ్యింది. అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో న‌టించిన ఆమె సీరియ‌ల్స్‌తో పాటు బుల్లితెర‌పై బాగా పేరు తెచ్చుకుంది. ఇక బిగ్‌బాస్‌లోకి ఎంట‌ర్ అయ్యాక ఆమెకు తెలుగు జ‌నాల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగింది. ఇక హ‌రితేజ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటారు. సోష‌ల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టుల‌కు విప‌రీత‌మైన లైకులు, కామెంట్లు వ‌స్తూ ఉంటాయి.

తాజాగా ఆమె త‌న ఇంటికి సంబంధించి ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఆమె త‌న ఇంట్లోని ప్ర‌తి వ‌స్తువును, డిజైనింగ్‌ను కూడా చూపించారు. దీంతో హ‌రితేజ ఇళ్లు ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌ల‌పించేలా ఉంద‌ని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పుడు ల‌క్ష‌ల్లో వ్యూస్‌, కామెంట్లు, లైకులు వ‌స్తున్నాయి. ఇక త‌న భ‌ర్త‌కు ఒకే చోట ఎక్కువ వ‌స్తువులు ఉంటే న‌చ్చ‌ద‌ని.. తన‌కు న‌చ్చిన‌ట్టుగా లోప‌ల ఇంటీరియ‌ర్ డిజైన్ చేయించుకున్నాన‌ని చెప్పారు.

ఈ క్రమంలోనే బిగ్‌బాస్ షోలో తార‌క్ త‌న‌కు ఇచ్చిన అవార్డును సైతం ఆమె చూపించి మురుసుకున్నారు. ఇక ఇంటికి వ‌చ్చిన వాళ్ల‌లో ఎక్కువ మంది బుద్ధుడి బొమ్మ‌లే త‌న‌కు బ‌హుమ‌తిగా ఇస్తున్నార‌ని కూడా హ‌రితేజ చెప్పారు. ఇక మా ఆయ‌న‌కు కాస్త చాద‌స్తం ఎక్కువ‌ని కూడా ఆమె ఓపెన్ అయిపోయింది.

ఇక షూటింగ్ నుంచి వ‌చ్చి అల‌సిపోతే లెగ్ మ‌సాజ‌ర్‌తో మ‌సాజ్ చేయించుకుంటాన‌ని. పాప కోసం అన్ని గ‌దుల్లోనూ ఉయ్యాల‌ను ఉంచామ‌ని చెప్పారు. ఇక హ‌రితేజ సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించ‌డం ద్వారా వ‌చ్చిన ఆదాయంతో ఈ ఇంటిని నిర్మించుకుంది. ఆమె ఇంటి విలువే కోట్ల‌లో ఉంటుంద‌ని ఈ వీడియో చూసిన వారు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news