Moviesముచ్చటగా మూడోసారి స‌మంత‌ రూటే వేరబ్బా..?

ముచ్చటగా మూడోసారి స‌మంత‌ రూటే వేరబ్బా..?

ఏమామ చేశావే సినిమాలో జెస్సీ పాత్ర‌తో ఒక్క‌సారిగా సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని త‌న వైపున‌కు తిప్పుకుంది స‌మంత‌. ఏడెనిమిది సంవ‌త్స‌రాలు అయితే కోలీవుడ్ లేదు… టాలీవుడ్ లేదు.. మొత్తం సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. కోలీవుడ్ విజ‌య్‌, సూర్య‌, విశాల్ నుంచి ఇటు టాలీవుడ్‌లో ప‌వ‌న్‌, మ‌హేష, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ ఇలా అంద‌రు స్టార్ హీరోల‌తోనూ న‌టించి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసింది.

ఇక అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకున్న స‌మంత నాలుగేళ్ల కాపురం త‌ర్వాత అంద‌రికి స‌డెన్ షాక్ ఇస్తూ అత‌డికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. విడాకుల త‌ర్వాత స‌మంతను టార్గెట్ చేస్తూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ విడాకుల‌కు కార‌ణం స‌మంతే అని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆమె అవి ఏం పట్టించుకోకుండా..తన కెరీర్ పై దృష్టి పెట్టింది. విడాకుల తరువాత వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది.

విడాకుల తరువాత ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీ..తాజాగా మూడో సినిమాకు కూడా పచ్చ జెండా ఊపిన్నట్లు తెలుస్తుంది.  ఇక ఈ క్రమంలో సమంత ముచ్చటగా మూడోసారి నాటురల్ స్టార్ నాని పక్కన నటించేందుకు రెడీ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నానితో ద‌స‌రా సినిమాకు ఓకే చెప్పిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. నాని ద‌స‌రా అనే సినిమా లో నటిస్తున్న విషయం తెలీసందే. ఈ సినిమాలో ఇప్ప‌టికే కీర్తి సురేశ్ ఒక హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో రెండో హీరోయిన్‌కు కూడా అవ‌కాశం ఉంది. ఆ పాత్ర కోసం అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత‌ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఇక సమంత కూడా ఈ ఆఫర్ గు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news