Moviesఅల్లు అర్జున్ కెరియ‌ర్‌లోనే ఇదే ఫస్ట్ టైం..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!!

అల్లు అర్జున్ కెరియ‌ర్‌లోనే ఇదే ఫస్ట్ టైం..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!!

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప మీదే బాగా వ‌ర్క్ చేస్తున్నాడు. బ‌న్నీ – సుకుమార్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న పుష్ప‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్,సాంగ్ ఇంకా పోస్టర్ లతో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హైప్ క్రియేట్ చేసి దూసుకు పోతుంది. ఇక రంగ‌స్థ‌లం సినిమాలో చిట్టిబాబు పాత్ర‌ను మించేలా పుష్ప పాత్ర ఉంటుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శేషాచ‌లం అడ‌వుల్లోని గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని తెలుస్తోంది.

పుష్ప పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో వ‌స్తోంది. ఇక పుష్ప‌ను పార్ట్ 1, 2 లుగా రిలీజ్ చేస్తున్నారు.ఇక ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానుంది. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటమే కాకుండా ఓవ‌ర్సీస్‌లోను భారీ స్థాయిలో విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక‌లు చేస్తున్నారు.

పుష్ప సినిమా రిలీజ్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ రిలీజ్ గా ఉంటుంది అని మేక‌ర్స్ చెపుతున్నారు. యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో కూడా హంసిని ఎంటర్టైన్మెంట్స్ అలాగే క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ రిలీజ్ గా ఈ చిత్రం ఉంటుంది అని మేకర్స్ అంటున్నారు. అలాగే డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్ తో ఈ చిత్రం అక్కడ రచ్చ స్టార్ట్ చేయనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news