Moviesప్రభాస్ హీరో అవ్వకుండా ఉంటే ఏమవ్వాలి అనుకున్నాడో తెలుసా..అసలు నమ్మలేరు..!!

ప్రభాస్ హీరో అవ్వకుండా ఉంటే ఏమవ్వాలి అనుకున్నాడో తెలుసా..అసలు నమ్మలేరు..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఒకప్పుడు చిన్న సినిమాలతో మొదలు పెట్టిన ఈయన కెరీర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ గా కొనసాగుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌కి ఇప్పుడున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. అయితే ఇంతటి భారీ ఫాలోయింగ్ కు కారణం బాహుబ‌లి సినిమానే అని చెప్పక తప్పదు. అది మనకు తెలిసిన విషయమే.

ఇక తాజాగా అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ తన పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు కూడా పుట్టినరోజును తెగ సంతోషంగా జరుపుకున్నారు. ఇక ప్రభాస్ అందరితోను చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు. ఫ్యామిలీ తో పాటు, తన స్నేహితులకు కూడా ఎంతో విలువ ఇస్తాడు.

అందుచేతనే ప్రభాస్ స్నేహితులు ఎప్పుడు తనంటే ఇష్టం అని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరికి తెలియని ఓ విషయాని ప్రభాస్ స్నేహితులు బయటపెట్టిన్నట్లు తెలుస్తుంది. అది ఏమిటంటే.. ప్రభాస్ హీరో కాకపోతే ..ఒక రెస్టారెంట్ తో పాటు, బిజినెస్ ను కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాడత. ఈ విషయాని స్వయానా ప్రభాస్ తో ఉండే కొంతమంది స్నేహితులు తెలియజేశారట. కాగా ప్రభాస్ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయ్యాడో మనం చూస్తూనే ఉన్నాం.

ప్ర‌స్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న ‘రాధే శ్యామ్’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయ‌నున్నాడు . మరోవైపు స‌లార్ అనే సినిమా కూడా చేస్తుండ‌గా, ఈ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్.. శ్రీ రామచంద్రుడి పాత్రలో అలరించనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news