Moviesఎన్టీఆర్ కోసమే ప్రత్యేకమైన సెట్ వేయిస్తున్న కొరటాల..ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో...

ఎన్టీఆర్ కోసమే ప్రత్యేకమైన సెట్ వేయిస్తున్న కొరటాల..ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రించుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత కొర‌టాల శివ సినిమాను ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాతో పాటు ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అఫీషియల్ ప్రకటన చేసి చాలా రోజులే అవుతుంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎపుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యారు. మరోవైపు కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసారు. ఒకసారి రంగంలోకి దిగాకా .. మూడు షెడ్యూల్స్‌లలో ఈ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందే ఈ సినిమాకు సంబంధించి ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.. కొరటాల.

ఈ సినిమా కోసం కొన్ని రోజులుగా ఒక భారీ సెట్ వేయిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి దగ్గరలోనే ఈ సెట్ వేయించారు. ప్రత్యేకమైన ఈ సెట్ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై అభిమానులు అంచనాలు భారీగానే పెట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news