Moviesస‌మంత‌ను ఆ హీరో ట్రాప్ చేశాడా... అలా వాడుకున్నాడా..!

స‌మంత‌ను ఆ హీరో ట్రాప్ చేశాడా… అలా వాడుకున్నాడా..!

నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట విడిపోవ‌డంతో ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన‌ట్టు మాట్లాడుతున్నారు. చాలా మంది స‌మంత‌దే త‌ప్పు అని అంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం చైతూది కూడా త‌ప్పు ఉంద‌ని అంటున్నారు. అయితే స‌మంత‌కు ఆమె స్నేహితుల‌తో పాటు మ‌హిళా న‌టుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ లిస్టులోనే సినీ న‌టి మాధ‌వి ల‌త కూడా ఉన్నారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో మాధ‌వీల‌త చైతు – స‌మంత విడాకుల‌పై స్పందిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విడాకుల‌కు స‌మంతే కార‌ణ‌మ‌ని ఎక్కువ మంది మాట్లాడ‌డం బాధ క‌లిగిస్తోంద‌ని.. కేవ‌లం గ్లామ‌ర్ దుస్తులు వేసుకోవ‌డం వ‌ల్లే స‌మంత చైతుకు విడాకులు ఇచ్చార‌న‌డంలో నిజం లేద‌న్నారు. తెర‌పై వేసుకునే దుస్తుల‌కు , సంసారానికి లింక్ ఉండ‌ద‌న్నారు. స‌మంత డ‌బ్బు మ‌నిషి కాద‌ని.. ఆమెకు సినిమాల ద్వారా వ‌చ్చిన డ‌బ్బును ఏంచేయాలో ఆమెకు తెలుస‌న్నారు.

అయితే గ‌తంలో స‌మంత‌ను ఓ హీరో ట్రాప్ చేశాడ‌ని.. ఆమె ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బు కోసం ఆమెను వాడుకున్నాడ‌ని కూడా మాధ‌వీల‌త సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చివ‌ర్లో స‌మంత త‌న‌ను వాడుకున్న విష‌యం తెలిసే స‌ద‌రు హీరోను దూరం పెట్టింద‌ని మాధ‌వీల‌త చెప్పింది. అయితే స‌మంత‌ను వాడుకున్న హీరో ఇత‌డే అంటూ నెటిజ‌న్లు ఓ హీరో పేరు బ‌య‌ట పెట్ట‌డంతో ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news